పాముకు పాలు పోసి పెంచినట్లు పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు నిధులు, ఆశ్రయం తదితరాలు కల్పిస్తూ అప్పుడప్పుడూ దాని కాటుకే గురవుతూ వస్తోంది. ఈ మధ్య యూరి దాడి తర్వాత ప్రతీకారంగా ఇండియా ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ తో ప్రపంచ దేశాలన్నీ పాక్ ఉగ్రశ్చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. మరి అసలు పాక్ కి ఉగ్రవాదులతో సంబంధాలు అవసరమా? అంటే దానికి వారి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అయితే ఇదే ప్రశ్నను సంధిస్తూ ఓ యువతి పాక్ ఆర్మీని కడిగేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
భారత్ లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ సాయం ఉందనేది జగద్విదితం. ఉగ్రవాదులను పంపేది పాక్ ఆర్మీ అనే ఒక వాదన ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై రెండేళ్ల క్రితం పాకిస్థాన్ లో టీవీ ఛానెల్ డిబేట్ నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ యువతి ఉగ్రవాదులు, మిలటరీ సంబంధాలపై కడిగిపడేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై ఆ యువతి మాట్లాడుతూ, పాక్ మిలటరీకి ఉగ్రవాదులకు సంబంధం ఏంటని ప్రశ్నించింది.
చరిత్రను తవ్వితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపింది. శత్రుత్వం పేరుతో, రాజకీయ ప్రయోజనాల పేరుతో ఎంత కాలం ఇలాంటి తప్పులు చేస్తుంటారని ప్రశ్నించింది. అమెరికా, భారత్, సమాజం, అవినీతి రాజకీయాలు ఇలా ఎన్ని మాట్లాడినా, జియావుల్ హక్ జనరల్ గా ఉన్న నాటి నుంచి ఉగ్రవాదులతో ఉన్న లింకులపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది. దేశంలోని ఏ రంగమూ పవిత్రంగా లేదని ఆమె మండిపడింది. వీటి గురించి నిర్లజ్జగా, వాస్తవాలు వాస్తవంగా మాట్లాడాలని ఆమె సూచించింది.
వాస్తవానికి దేశంలో మిలటరీ పాత్ర ఎంత? ఎంతవరకు ఉండాలి? అన్నది తెలియజేయాలని సూచించింది. దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణమేంటని ప్రశ్నించింది. ఇందులో ప్రభుత్వ తీరును ఎండగట్టింది. అవినీతి రాజకీయ నాయకులపైనా దుమ్మెత్తి పోసింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆ అందమైన యువతిని చూసి అక్కడున్నవారు కన్నార్పడం కూడా మర్చిపోవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more