కేసీఆర్ దీపావళి ధమాకా వారికోసం... | KCR on cabinet shuffle on diwali

Kcr on cabinet shuffle on diwali

Telangana cabinet reshuffle, T cabinet on Diwali, KCR Dipawali gift, KCR suspense on Cabinet reshuffle

KCR cabinet re shuffle on diwali.

జిల్లాల పంతం నెరవేరిందిగా! మరీ నెక్స్ట్ ఏంటి?

Posted: 10/15/2016 01:36 PM IST
Kcr on cabinet shuffle on diwali

ప్రతిపక్ష కొత్త అల్లుళ్ల కోరికలను తీరుస్తూనే టీ సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల పంతం నెరవేర్చుకున్నాడు. ముఖ్యమైన ఈ తంతు ముగిసిపోవటంతో ఇక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటుకు త్వరలో సిద్ధమైపోతున్నాడు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుత మంత్రుల పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని కొందరిని పార్టీ కోసం పంపించి, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచనలో ఉంది.

ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఓ పత్రికతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురో, నలుగురో పార్టీ కోసం వెళ్లాల్సి ఉంటుందని, ఆ సందర్భం వస్తే ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు విస్తరణపై ప్రచారం జోరందుకుంది. జిల్లాల విభజనపై ప్రజలు సంతోషంగా ఉండడం, తొమ్మిది కార్పొరేషన్ చైర్మన్ పదవులను సీనియర్లతో భర్తీ చేయడంతో పార్టీలో మార్పులు చేర్పులకు ఇదే సరైన సమయమని పార్టీలోని ఓ వర్గం నేతలు భావిస్తుండగా, మరో వర్గం మాత్రం ఇప్పట్లో విస్తరణ ఉండకపోవచ్చని చెబుతోంది.

అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. దసరా సందర్భంగా తొమ్మిది నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం త్వరలోనే మరిన్ని పదవులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈసారి భర్తీలో మహిళలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలవారికి పెద్దపీట వేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా ఇప్పటికే వేగం పుంజుకున్న మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియను త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత దేవాలయ పాలక వర్గాల నియామకం చేపట్టనున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  CM KCR  cabinet  reshuffle  

Other Articles