వార్తల్లో నిలిచిన అత్యాచార బాధితురాలికి అండగా నిలిచేందుకు దేశం మొత్తం ముందుకు వస్తోంది. యూపీ లోని బరేలిలో జరిగిన ఓ దారుణ ఘటనలో ఓ మైనర్ బాలిక గర్భవతి అయి పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ యువతిని తాము పెంచుకుంటామంటూ పలువురు ఆమెకు విన్నపాలు ఇస్తున్నారు.
అసిఫ్ ఖాన్ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఓ బాలికపై ఆ ఇంటి యజమాని కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఈ ఘోరంపై బాలిక(16) జూన్ 7న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జరిగిన ఘోరంతో కుమిలిపోతున్న ఆమెకు గర్భం వచ్చిందన్న విషయం తెలిసి మరింత కుంగిపోయింది. గర్భస్రావానికి అనుమతించాలంటూ జూలై 26న జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటికే 26 వారాల గర్భవతి అవడంతో కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
గురువారం బాలికకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ లోనే ప్రసవించింది. దీంతో బిడ్డను నిందితుడి కుటుంబానికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటేనే బిడ్డను స్వీకరిస్తామని ఆసిఫ్‌ఖాన్ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా బాలిక బిడ్డను దత్తత తీసుకుంటామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని తమకు దత్తత ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో హిందువులు, ముస్లింలు, ధనవంతులు, పేదలు కూడా ఉండడం గమనార్హం. ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తాము ఇక్కడి వచ్చామని వారు చెబుతుండడం విశేషం. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు బాలిక కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more