బడితే పూజను తాళలేక యువతులు శోకాలు.. 13 people caned for indecency in Aceh

Aceh flogs 13 young people for breaking its strict islamic laws

woman whipped, canned, indonesian woman, hugs and kisses, sharia act, intimacy, girls with boy friends, fellow university students, indonesia, unmarried couples

The unidentified woman screamed out in pain as she was caned in Indonesia's Aceh, for breaking the province's strict Islamic law forbidding intimacy between unmarried couples.

ITEMVIDEOS: బడితే పూజను తాళలేక యువతులు శోకాలు..

Posted: 10/18/2016 06:57 PM IST
Aceh flogs 13 young people for breaking its strict islamic laws

మారుతున్న సమాజంతో పాటు తాము మారాలన్న ఉద్దేశ్యంతో వారు ఏకీభవించరు. అలాగని ఎవరైనా మారినా వారిపై కోరడా ఝుళిపిస్తారు. అంటే నాగరికత మారినా.. వారు విధించుకున్న పరుధులను దాటి వారు రారు. అలాగని తమవారెవైనా తమ పరుధులను దాటి వెళ్లారంటే వారికి కఠిన శిక్ష్లనలను అమలు చేస్తారు. తమ వారిగా వుండాలంటూ మాత్రం తమ పరదులకు లోబడి వుండాలన్నదే తమ శాసనం. ప్రపంచంతో పాటు తాము నడవమని తేల్చిచెప్పెడంతో పాటు తమ బిడ్డలు కూడా పాశ్చత్య సంసృతి వైపు అకర్షితులవ్వయకుండా గిరిగీసుకుంటున్నారు.

తమ కట్టుబాట్లను కాదని, తమ పరిధిలతో తమకు సంబంధం లేదని భావించిన యువతి యువకులకు తమ ఇస్లామ్ మతానుసారం షరియా చట్టం కింద శిక్షలు విధిస్తారు.స్థానికంగా వున్న మసీదుకు చేరువలోని ఓ వేధికపై బహిరంగంగా శిక్షలు విధిస్తారు. వీటిని వందల మంది చుట్టూ చేరి వినోదంగా చూస్తుంటారు. అంతేకాదు గేలి చేస్తారు కూడా. ఇలా వేసిన శిక్షలో భాగంగా ఓ యువతికి 23 దెబ్బలను కోడుతుండగా, వాటికి తాళలేక అయవతి కేకలు వేస్తూ..బాధతో విలవిల్లాడిపోతుండగా పురజనులు మాత్రం వాటిని అస్వాధించారు. నవ్వుకున్నారు.

ఇస్లామిక్ చట్లాలను ఉల్లంఘించిందన్న కారణంగా యువతిని బెత్తంతో కోట్టారు. ఈ ఆటవిక చర్య.. ఇండోనేషియాలో తాజాగా వెలుగుచూసింది. ఇండోనేషియాలోని చాలా రాష్ట్రాల్లో షరియా చట్టాన్ని గట్టిగా అమలుచేస్తారు. జూదం ఆడినా, మద్యం తాగినా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా, వివాహం కాని యువతీ యువకులు చనువుగా తిరిగినా కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. ఇలా ఈ నెల శిక్షలను 13 మంది ఎదుర్కోన్నారు.వాళ్లలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.

వీరంతా 21 నుంచి 30 ఏళ్లలోపు వారే. వీళ్లందరినీ ఆ రాష్ట్ర రాజధాని బందా అసేలో ఒక మసీదు వద్ద నిలబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టారు. దాన్ని చుట్టూ ఉన్న జనం వినోదం చూస్తూ నిలబడ్డారు తప్ప.. ఎవరూ వ్యతిరేకించే ధైర్యం చేయలేదు. పెళ్లికాని యువతీ యువకులు ఒకరినొకరు ముట్టుకోవడం, కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా వాళ్లు ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించారని తేల్చారు. మరో వ్యక్తి అయితే.. ఒక మహిళతో కలిసి రహస్య ప్రదేశంలో గడిపినందుకు శిక్ష విధించారు.

వారిలో 22 ఏళ్ల మహిళ గర్భవతి కావడంతో.. ఆమెకు తాత్కాలికంగా శిక్ష నుంచి ఊరటనిచ్చారు. అయితే, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శిక్ష అమలుచేయాలని బందా అసె డిప్యూటీ మేయర్ జైనల్ అరిఫిన్ తెలిపారు. ఇలాంటి శిక్షలు కఠినమైనవే అయినా.. దీనివల్ల భవిష్యత్తులో ఇంకెవరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటారని అన్నారు. ఇటీవలి కాలంలో మహిళలు సహా పలువురికి ఇలా బహిరంగంగా బెత్తం దెబ్బల శిక్షలు పడుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unmarried couples  guilty  islamic laws  sharia acts  canned publicly  indonesia  

Other Articles