మన దేశంలోనే కాదు లైంగిక దాడులు విదేశాల్లోనూ ఎక్కువగానే జరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. వయసు భేదం లేకుండా అక్కడ ఆడాళ్లపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంతేందుకు టీవీ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ బ్యాక్ ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించడం, ఆమెను కట్టేసి ఏం చేయకుండా కేవలం దోచుకుని పోవటం మనకు తెలిసిందే. ఇప్పుడు మరో ఉదంతం అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
ఫ్రెంచిలో పాపులర్ టీవీషో ది టీపీఎంపీ లో మిలియన్ డాలర్ రాబరీ అనే కాన్సెప్ట్ ను నిర్వహించారు. అచ్చం కిమ్ కర్దాషియన్ దేహశిరులతో ఉన్న సోరయా రిఫ్పీ అనే యువతిని ఎంపిక చేసి స్టేజీ మీదకు పిలిచారు. కిమ్ పై ఎలాగైతే దాడి జరగటం అంటూ ఓ డ్రామా ప్లే చేసి, చివరకు ఆమెను రక్షించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు చెత్త మొదలైంది. ఆమెను కాపాడినందుకు కృతజ్నతగా తనను ముద్దు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యాంకర్ జీన్ మైకేల్ మేయర్ ఆమెను కోరాడు. అందుకు ఆమె నో చెప్పింది.
కాసేపు మరో ప్రజెంటర్ సైరిల్ హనోవాతో కుళ్లు జోకులు పేల్చి చివరాఖరికి ప్రోసీడ్ అవుతూ చెంప దగ్గరికి వెళ్లి, ఆమె వక్ష భాగాలపై ముద్దు పెట్టాడు. అంతే జడ్జితో సహా అక్కడున్న వారంతా కంగుతిన్నారు. అఫ్ కోర్స్ ఆ యువతి కూడా దానిని లైట్ తీస్కుంది. అయితే ఆ చర్యపై ఇప్పుడు అక్కడ పెద్ద చర్చ జరుగుతుంది. ఆ టీవీ చానెల్ పై బ్యాన్ వేయాలని మహిళా ఉద్యమ కారిణులు డిమాండ్ చేస్తున్నారు.
ఆమె వద్దంటున్నా బలవంతంగా ముద్దు పెట్టాడంటూ అతగాడి తీరుపై విమర్శలు చెలరేగాయి. కొందరు న్యాయస్థానంను ఆశ్రయించారు కూడా. ఫ్రెంచ్ చట్టాల ప్రకారం హింస, బలవంతం, బెదిరింపు లేదా ఆశ్చర్యం కలిగించేలా అడాళ్లతో పిచ్చి చేష్టలకు పాల్పడితే వారికి లైంగిక నేరాల చట్టం కింద ఐదేళ్ల శిక్ష, 75,000 పౌండ్ల ఫైన్ విదిస్తారు. ఇక విమర్శలు తట్టుకోలేక ఆ యువతితో సహా జీన్ ఓ టీవీ షోకి హాజరై కన్నీరు మున్నీరు అయ్యాడు.
తన గురించి అందరికీ తెలుసని, సరదాగా చేసిన స్టంట్ ను ఇంత వివాదం చేయటం సరికాదంటూ వేడుకున్నాడు. ఇక ఆ యువతి కూడా జీన్ చాలా మర్యాదగా నడుచుకున్నాడని, తనకు శిక్ష పడటం కరెక్ట్ కాదంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more