అగ్రరాజ్యం అమెరికా పీఠం కోసం జరగనున్న తుదిపోరు ఎన్నికలలో రిగ్గింగ్ జరిగేందుకు అస్కారం భారీగా వుందన్న కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్ష రేసులో వున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన అరోపణలకు కథనాలు బలం చేకూర్చుతున్నాయి. అయితే రిగ్గింగ్ కు పాల్పడేది ఎవరి మద్దతుదారులన్నది తెలియకపోయినా.. ట్రంప్ కాస్తా ముందుగానే దీనిపై అందోలన వ్యక్తం చేస్తూ ప్రపంచ దృష్టిని మాత్రం అకర్షించారు. అమెరికాలో అత్యంత సంపన్న వర్గానకి చెందిన ట్రంప్ తన మద్దతుదారులతో రిగ్గింగ్ కు పాల్పడతారా..? అందుకనే ఈ అరోపణలు ముందుగానే ప్రత్యర్థి పైకి నెట్టివస్తున్నారా..? అన్న అనుమానాలు కలగక మానవు.
ఇక ముందునుంచి పేరు వినబడుతున్నా.. సాండర్స్ లాంటి దిగ్గజాలను చివరి క్షణంలో వెనక్కి నెట్టి చాపకింద నీరులా.. అంచాలను క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చి.. అగ్రరాజ్యం చరిత్రలోనే తొలి మహిళ అధ్యక్షురాలిగా బరిలో నిలిచిన హిల్లరీ తన అనుయాయువులతో ఈ చర్యలకు ఉపక్రమించేలా చేస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక మరో ప్రశ్న ఏమిటంలే అసలు వీళ్లు పురమాయించకుండానే వారి వర్గీయులు అభిమానంతో ఇలాంటి చర్యలకు పాల్పడతారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు నవంబర్ 8 ఎన్నికలూ సమాధానం చెప్పాలి.
అయితే శాస్త్రసాంకేతికతలో అగ్రభాగన నిలిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందా.? అదెలా..? అయినా అంత డబ్బు ఎవరు ఖర్చుచేస్తారు అన్న సందేభాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అవును నిజమే.. సాంకేతికతో ముందువరుసలో నిలిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలోనూ రిగ్గింగ్ జరుగుతుందని, ఇందుకు అస్కారం లేకపోలేదని సైబర్ భద్రతా సంస్థ సెమాన్ టెక్ వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు రిగ్గింగ్ ఎన్నికలంటూ రచ్చ చేసిన ట్రంప్ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. అది కూడా అత్యంత తక్కువ (కేవలం 15 డాలర్లు, అనగా సుమారు వెయ్యి రూపాయల) ఖర్చుతో రిగ్గింగ్ జరుగుతుందని తెలిపింది.
సాధారణంగా అమెరికా ఓటర్లు ఎన్నికలలో ఓట్లు వేసేందుకు వినియోగించే చిఫ్ కు రాస్ బెర్రీ పి-ఐ అనే చిన్న ఎటక్రానిక్ పరికరాన్ని వినియోగిస్తే చాలునని కూడా తెలిపింది. దీంతో ఓటు హక్కును వివనియోగించుకున్న వారి కోడ్ మరలా మరలా ఇతర ఓటర్లు వినియోగించే అవకాశం వుందని, సిమాన్ టెక్ సంస్థ తెలిపింది. అయితే క్రెడిట్ కార్డు ప్రోగ్రామింగ్ తెలిసిన వారు ఈ విధానాన్ని పోలింగ్ బూత్ లో సమయస్పూర్తితో అత్యంత వేగంగా వినియోగించాల్సి వుంటుందని తెలిపారు.
అమెరికన్ ఓటర్లు చిప్‌కార్డు ద్వారా ఓటుహక్కును వినియోగించుకుంటారు. చిప్‌లో క్రెడిట్ కార్డు తరహా వ్యవస్థ ఉండడంతో హ్యక్ చేసి అదుపులోకి తీసుకోవచ్చు. ఫలితంగా అదే కార్డును మరొకరు వినియోగించేట్లు చేయవచ్చని సియాన్టెక్ పేర్కొంది. తాము పరిశీలించిన ఓటింగ్ యంత్రంలో ఏదీ ఎన్క్రిప్షన్ రూపంలో లేకపోవడంతో ఇది మరింత తేలికవుతోందని పేర్కొంది. చిప్ కార్డ్ ప్రోగ్రాంను కార్టుతో రీసెట్ చేసి రెండుసార్లు ఓటింగ్‌కు వినియోగించేలా చేయొచ్చని.. అవసరమైతే రెండుసార్ల కంటే ఎక్కువగా కూడా వినియోగించే వీలుందని వెల్లడించింది.
ఇక ఓట్ల అక్రమాలకు పాల్పడేందుక మరో మార్గం ట్యాంపరింగ్. ఓన్నింగ్ యంత్రంలోని ట్యాబ్లేషన్లో మార్పులు చేసి కూడా రిగ్గింగ్ చేయవచ్చని ఆ సంస్థం వెల్లడించింది. సాధారణంగా ఓటర్ల సమాచారం మొత్తం పెన్‌డ్రైవ్ వంటి స్టోరేజి పరికరంలో ఎటువంటి ఎన్క్రిప్షన్ లేకుండా టెక్ట్స్ రూపంలో ఉంటుందని, దానిని తమ వద్ద వున్న డివైస్ లతో ఓటర్లు పొలింగ్ బూత్ లో టాంపరింగ్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేసింది. మరో పక్షం రోజుల వ్యవధిలో జరిగే అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలను నివారించేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. లేక పాత పద్దతినే పయనిస్తుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more