అమ్మ ఫోటో రాజకీయాలపై బీబీసీ స్పెషల్ స్టోరీ | BBC special story on Jayalalitha

Bbc special story on jayalalitha

CM Jayalalitha's Health, BBC special story on Jayalalitha, BBC on Tamil Nadu Photo Politics, Tamil Nadu Photo Politics, Sworn on Amma, Jayalalitha's Health, BBC on TamilnNadu politics, BBC TamilNadu, BBC Jayalalitha, Jayalalitha discharge date, Jayalalitha's discharge, Karunanidhi health

CM Jayalalitha's Health Cured, Likely to discharge on 27th October. BBC special story on Jayalalitha's Photo Politics in Tamil Nadu.

అమ్మ డిశ్చార్జి అదేరోజున... బీబీసీలో ఏం రాశారో తెలుసా?

Posted: 10/26/2016 08:46 AM IST
Bbc special story on jayalalitha

అన్నాడీఎంకే కార్యకర్తలకు, అమ్మ అభిమానులు ఈ దీపావళితోపాటు అదనంగా మరో పండగ జరపుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడటంతో పండగకు ముందుగానే సీఎం జయలలితను డిశ్చార్జి చేయాలని అపోలో ఆస్పత్రి వర్గాలు నిశ్చయించుకున్నాయి. అన్నీ కుదిరితే ఆదివారం ఆమెను ఇంటికి పంపించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు.

లంగ్స్ ఇన్ఫెక్షన్, షుగర్ లెవల్లో తేడా కొట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురై గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జయ ఆరోగ్య విషయంలో ఎలాంటి అప్ డేట్స్ బయటికి చెప్పకుండా నెల రోజులపాటు హైడ్రామా నడిపి అనంతరం ఆమె కోలుకున్నారంటూ అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి.

ప్రస్తుతం స్వయంగా ఆమే ఆహారం తీసుకుంటున్న నేపథ్యంలో డిశ్చార్జి కోసం వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ, విదేశీ వైద్యుల చికిత్సతో కోలుకున్న సీఎం వైద్యులతో మాట్లాడుతున్నారు. ఆహారాన్ని కూడా స్వయంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఆమెకు చికిత్స అందిస్తున్న లండన్ వైద్యుడు మంగళవారం ఆస్పత్రిలో ఆమెకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షి సంతృప్తి వ్యక్తం చేశారు. డిశ్చార్జి చేసే విషయంపై అదే రోజు ప్రకటన రానుందట.

ఇక ఓవైపు అమ్మ ఆరోగ్యం కుదుటపడగా ఆమె రాజకీయ ప్రత్యర్థి, పొలిటికల్ భీష్ముడు కురుణానిధి అస్వస్థతకు గురికావటంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రోజు తీసుకునే మందులు(మెడిసిన్స్) వల్ల అలర్జీ కావడంతో 92 ఏళ్ల కరుణానిధి అస్వస్థతకు గురైనట్టు పార్టీ మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

బీబీసీలో అమ్మ గురించి...
పురాణాల్లో తండ్రి మాటను జవదాటక రాముడు అడవులకు వెళ్లితే... తమ్ముడు భరతుడు అన్న పాదుకలతో రాజ్య పాలన చేశాడు. మరి అమ్మ లేనప్పుడు ఆమె ఫోటోనే కదా వారికి దిక్కు. అందుకే పన్నీర్ సెల్వం లాంటి అనుచరులు జయలలిత ఫోటోతో పాలన చేశారు. చేస్తున్నాడు కూడా. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఇప్పుడు ఇదే అంశంపై కథనం ప్రచురించింది.

ఇది ఒక మానసిక రుగ్మత అయినప్పటికీ, రాజ్యాంగంపై కాకుండా, ఆమె(అమ్మ)పై ప్రమాణం చేయటం, ఆమె పేరు మీదే వ్యవహారాలను చూసుకోవటం, చివరాఖరికి కేబినెట్ మీటింగ్ లలో కూడా ఆమె ఫోటోను పెట్టుకోవటం తదితర అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయని బీబీసీకి ఇండియా తరపు ప్రతినిధి జి.సత్యమూర్తి చెబుతున్నారు. పూర్తి కథనం కోసం కింది లింకు క్లిక్ చేయండి.

ఫోటో రాజకీయాలు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalitha  Health  BBC special story  

Other Articles