విశాఖపై మళ్లి ప్రకృతి ప్రకోపాన్ని చాటుకుంటుందా..? హుద్దూద్ తుఫాను విసిరిన పంజా ధాటికి త్వరగానే కోలుకున్న విశాఖపై మరోమారు విలయం ముంచెత్తనుందా.? విశాఖలో హుధూధ్ మిగిల్చిన గాయలు ఇంకా పలువుర్ని వెంటాడుతున్న తరుణంలోనే కయాంట్ తన ప్రకోపంతో పగబట్టనుందా..? అయితే అవుననే అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నుంచి వాయుగుండంగా బలపడిన వర్షాలతో సరిపెడుతుందని భావించిన తరుణంలో అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని నిఫుణులు చెబుతున్నారు.
కాగా, తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి 'కయాంట్'గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, ఈ రాత్రికి పోర్టుబ్లెయిర్ తీరానికి ఉత్తర వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పై దీని ప్రభావం తీవ్రంగా వుంటుందని పడనుందని అంటున్నారు. దీపావళి పండగ పర్వదినం సంబరాలకు ముస్తబవుతున్న బెంగాల్ వాసుల ఆశలపై కయాంట్ నీళ్లు చల్లుతుందని అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై కయాంట్ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. తీరప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తనున్న నేపథ్యంలో అంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే 27 లేదా 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలరలించాలని ప్రభుత్వాలు అదేశాలు జారీ చేశాయి. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వారు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more