తాను చేయాలనుకున్న పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొండిగా ముందుకు వెళ్లటం తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు స్టైల్. అంశంపై వివాదాలు, ఆరోపణలు, వాదనలు ఎలా ఉన్నా సరే ఆయనదే ఫైనల్ డెసిషన్. ఆఖరికి బంతి కోర్టులో ఉన్నాసరే దానిని అనుకూలంగా మార్చుకునే దిశగా ఆయన చేసే ప్రయత్నాలు దాదాపు సఫలీకృతమే అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సచివాలయ నిర్మాణ నిర్ణయం కూడా అందులోకి చేరిపోబోతుంది.
సచివాలయం తరలింపు, కొత్త భవనాల నిర్మాణంలో ముందుకే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నా సరే ప్రస్తుత సచివాలయం భద్రతాపరంగా, సౌకర్యాల పరంగా బాగా లేదని భావిస్తున్న సర్కార్.. ఈనెల 14న కార్తీక సోమవారం కావటంతో కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయాలన్న ఆలోచన చేస్తోంది. ఆ రోజు మంచి ముహూర్తం కావడంతో ముందు శంకుస్థాపన చేసి.. కోర్టులో కేసులు తేలాక ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది.
సచివాలయం తరలింపును హైకోర్టు కూడా వ్యతిరేకించక పోవడంతో ఈ లోగా తరలింపు కోసం పూర్తి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో సచివాలయంలోని ఏ, బీ, సీ బ్లాకులను, ఆ తర్వాత డీ బ్లాకును కూలగొట్టనున్నారు. ఆలోగా ఏపీ సచివాలయం ఆధీనంలోని భవనాలు కూడా చేతికి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నూతన సచివాలయ నిర్మాణంతో పాటు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ తన కొత్త క్యాంపు అఫీస్ పక్కనే ఉన్నాతాధికారులకు క్యాంపు ఆఫీస్ లు నిర్మించాలని యోచిస్తున్నారు.
సీఎంకి ఎప్పుడు అందుబాటులో ఉండేలా ఈ క్యార్టర్స్ను నిర్మాణాలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. పేషీ అధికారులతో పాటు స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారులు తనకు అందుబాటులో ఉండే విధంగా... వారి నివాస గృహ సముదాలాయు ఉండాలని యోచిస్తున్నారు.
సిఎం క్యాంపు ఆఫీస్ పక్కనే పంజాగుట్టలో ఉన్నతాధికారులకు క్వార్టర్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంవో సెక్రటరీలు, స్పీకర్, మండలి ఛైర్మన్.. మొత్తం 15 మంది అధికారులకు అత్యాధునిక హంగులతో నివాస సముదాయాలు నిర్మించనున్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. క్వార్టర్స్ నిర్మాణంపై చర్చించారు. క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాకుండా.. జిల్లా కేంద్రాల్లోనూ అధికారులకు ఆఫీసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే కోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తున్న క్రమంలోనే మరోవైపు శంకుస్థాపన జరిపించటం ఆసక్తికరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.380 కోట్లతో విశాలమైన సచివాలయం రూపుదిద్దుకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more