మరోమారు అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ Centre Says Reorganisation of Constituencies Not Possible

Center gives clarity on increase of assembly seats in telugu states

union government, central government, modi government, bjp government, telugu states, Andhra pradesh, Telangana, union home ministry, minster for hime affairs, hansraj gangaram ahir, parliament, winter parliament session, reorganisation of constituencies

The Centre has once again categorically stated that there was no possibility of increasing the number of assembly constituencies in both the Telugu states.

మరోమారు అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ

Posted: 11/29/2016 06:05 PM IST
Center gives clarity on increase of assembly seats in telugu states

కేంద్ర ప్రభుత్వం మరోమారు పూర్తి స్పష్టతను ఇచ్చింది. గత ఎన్నికలలో ఆశలు రేపినా.. అవకాశంలో లేక, రాక ఎందరో అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఫుల్ గ్యారంటీ అంటూ పార్టీలు గత ఎన్నికలలో పలువరు అభ్యర్థులకు హామీలను గుప్పించాయి. దీంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు అధికార పక్షాలు ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులను వలస తెచ్చుకున్నాయి. ఆయా స్థానాలలో వున్న తమ అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసినా.. ప్రభుత్వం బలపడుతుంది కదా అని సమాధానం ఇచ్చారు.

అయితే మా పరిస్థితి ఏం కానూ.. ఇన్నాళ్లు పార్టీకి నిర్ణయానికి కట్టుబడి, పార్టీకి సేవ చేసినందుకు ఇదేనా ప్రతిఫలం అని కూడా అశావహులు, నియోజకవర్గ స్థాయి నేతలు నిలదీశారు. ఇందుకు ఇప్పటివరకు అధికార పక్షాలు తమ నేతలకు పునర్విభజన జరగడం గ్యారంటీ.. దాంతో స్థానాలు పెరగడం.. ఇబ్బంది లేకుండా అవగాహనతో సీట్ల పంపకం జరుపుతామని సమాధానమిస్తూ వచ్చాయి. కానీ అధికారపక్షాలకు కేంద్ర ప్రభుత్వం మాత్రం షాక్ ఇస్తుంది.

తాజాగా తెలంగాణ ఎంపీలు డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, కొత్త మనోహర్‌ రెడ్డి ఈ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ సమాధానమిస్తూ.. ఆర్టికల్‌ 170లోని సెక్షన్‌ 26ను సవరిస్తే తప్ప అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదని అటార్నీ జరనల్‌ తెలిపారని పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంపు కుదరదని ఆయన స్పష్టం చేశారు.

పునర్విభజన చట్టంలో పోందుపర్చిన ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పలు పర్యాయాలు ప్రస్తావించి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరాయని, దీంతో కేంద్ర న్యాయశాఖ ఈ అంశంపై అటార్నీ జనరల్‌ను వివరణ కోరిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 (3) ప్రకారం 2026లో జనభా గణనను చేపట్టేవరకు ఏ రాష్ట్రం కూడా అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపట్టేందుకుకు వీలులేదని అటార్నీ జరనల్‌ స్పష్టం​చేసినట్టు ఆయన తన సమాధానంలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles