పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతి, నల్లధనంపై యుద్దం సాగించడంలో ఎటువంటి పరిస్థితులలో వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పిన నరేంద్రమోడీ ప్రభుత్వం మెతకబడింది. గత 20 రోజులుగా దేశంలోని సామాన్య ప్రజలు డబ్బుల కోసం అనేక అవస్థలు పడుతున్నా పట్టని కేంద్రం.. నల్లధన కుబేరులకు మాత్రం మరో ఆఫర్ ను అందించింది. ఇప్పటికే దేశంలో పది శాతం లోపు వున్న నల్లకుభేరులు కోసం 90 శాతం దేశప్రజలను అవస్థల పాలు చేస్తారా..? అన్న విమర్శలు తెరపైకి వస్తున్నా.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి వెనకడుగు వేయదని పలుమార్లు స్పష్టం చేసిన ప్రధాని.. ప్రజలకు కొన్నాళ్లు అవస్థలు తప్పవని సూచిస్తూనే.. నల్ల కుభేరులకు మాత్రం మరో ఆఫర్ ను ప్రవేశపెట్టారు.
గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడా నల్లధన కుబేరులు చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బును మారుస్తునే, బినామీ అకౌంట్లలో జమచేస్తునో పట్టుబడకపోవడంతో.. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. నల్లకుబేరులకు క్షమాభిక్ష ప్రసాదించింది. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ స్కీమ్ కింద నల్లడబ్బును వెల్లడిస్తే పన్ను, సర్చార్జి కలుపుకొని 50 శాతం జరిమానా విధిస్తారు. 25 శాతం సొమ్మును నాలుగేళ్లపాటు వడ్డీరహితంగా ప్రభుత్వం వద్ద భద్రపరుచుకొని ఆ తర్వాత తిరిగి చెల్లిస్తారు. అంటే నల్లధనం సగం సగం పంచుకుంటున్నారు.
ఈ స్కీమ్ కింద కాకుండా ఎవరివద్దనైతే నల్లడబ్బు దొరకుతుంతో వారికి 75 శాతం జరిమానా విధిస్తారని, అవసరమైతే మరో పది శాతం సర్చార్జి విధించే అవకాశం ఉంటుందన్నది చట్టంలోని మరో అంశం. ఎలాంటి జైలు శిక్షలు అనుభవించాల్సిన అవసరంలేకుండా కేవలం జరిమానాలతోనే సరిపెడుతూ నల్ల కుబేరులకు సర్కారు ఇస్తున్న సరికొత్త ఆఫర్ ఇది. నల్లకుబేరులను కఠినంగా శిక్షిస్తామని, ఆదాయం పన్ను ఎగవేయడం మానవత్వానికి వ్యతిరేకంగా జరగుతున్న నేరంగా పరిగణిస్తున్నామని చెప్పుతూ వస్తున్న కేంద్రం.. వారిపై పదే పదే ప్రేమను కబర్చడంతో మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more