డిసెంబర్ నెల వచ్చిందంటే చాలూ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశాలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ప్రకృతి విపత్తులు తీవ్ర విషాదాలను మిగిల్చాయి కాబట్టి. 2004 లో ఇండోనేషియాతోపాటు పలు ఆసియా దేశాలకు అప్పుడే పరిచయం అయిన సునామీ లక్షల మంది ప్రాణాలను బలిగొంది. మొత్తం లక్షా 70 మంది చనిపోయినట్లు ఓ అంచనా. ఇక భారత్ లో అయితే 8 వేల మంది చనిపోయారు.
ఇక ఆ దెబ్బకి తీవ్రంగా నష్టపోయిన ఇండోనేషియాలో బుధవారం వేకువఝామున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఇండోనేషియా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్తర సుమత్రాలోని బండా అసెకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అమెరికా జియాలాజికల్ సర్వే పేర్కొంది. వేల సంఖ్యలో బిల్డింగ్ లు కుప్పకూలిపోగా, 25 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద లెక్కలేనంత మంది ఇరుక్కుని ఉంటారని సమాచారం.
భూమికి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా 2004లో ఇదే ప్రాంతంలో సంభవించిన సునామీ తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ యేడాది జూన్ లోనూ సుమత్రతా ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూమి కంపించి విపరీతమైన ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, ఎవరూ చనిపోకపోవటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more