కరెన్సీ కష్టాలతో నిత్యావసర వస్తువులను కొనుగొలు చేసుకోవటమే కాదు, కనీసం రవాణాలు కూడా చేయలేని పరిస్థితికి సామాన్య ప్రజానీకం చేరుంది. బ్యాంకుల్లో సైతం కరెన్సీ లేకపోవటం, ఉన్న డబ్బును రాత్రికి రాత్రి ఏటీఎంలో నింపితే, ఉదయం కల్లా మాయం అయిపోవటం ఇలా కొత్త నోటు వాసన ఇంకా చూడని వారు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే జనాల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వాలు కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే క్యాష్ లెస్ అంటూ రంగంలోకి దిగిన కొన్ని రాష్ట్రాలు పీవోఎస్ మిషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రానున్న నాలుగు నెలల్లో 10లక్షల మిషిన్లను అందుబాటులోకి తేవాలంటూ బ్యాంకులను కోరింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్లుగానే ఆలోచనలు చేస్తుంది. త్వరంలో ఆర్టీసీ బస్సులో కూడా స్వైపింగ్ తరహా మిషన్ లను అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించనుంది. ప్రధాన బస్టాండ్ లైన మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నేరుగా కార్డుల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇక ఇంతేకాదు ఏకంగా సిటీ బస్సుల్లో కూడా స్వైపింగ్ ఆధారిత టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ నెల 15 నుంచి మొదటి విడత సేవలను ప్రారంభించి, ఆపై పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని గ్రేటర్ ఈడీ పురుషోత్తమ్ మీడియాకు తెలిపాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని బ్యాంకులతోనూ ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా ఆయన వివరించాడు.
కరెన్సీ రద్దు తర్వాత కేవలం బస్ పాస్ లపైనే సుమారు కోటిన్నర నష్టం వాటిల్లిందని, పాత నోట్లను పాస్ రెన్యువల్ కి తొలుత అంగీకరించకపోవటంతోనే ఇలా అయ్యిందని ఆయన తెలిపాడు. అందుకే సిటీ బస్సుల్లో కూడా ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నాడు. సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, కోఠీ, చార్మినార్, వీఎస్టీ, సనత్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లోని ప్రధాన కేంద్రాల్లో స్వైపింగ్ సేవలను అందుబాటులోకి తేబోతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఈ ప్రయత్నం ప్రారంభించగా సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఈ నిర్ణయం తెలంగాణకు ఏ మేర లాభిస్తుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more