మనిషి కఠినం.. కానీ, మనసు వెన్న | Jayalalithaa heart melting incidents.

Lesser known facets of jayalalithaa

Jayalalithaa's career, Jayalalithaa helping nature, Jayalalithaa's sentiments, Jayalalithaa's tomb, Jayalalithaa's watch, Jayalalithaa Dog, Jayalalithaa fans in DMK, Jayalalithaa buried, Jayalalithaa's helping nature

A look back at CM Jayalalithaa's career and such rare incidents about her kindness.

జయలలిత మనసు ఎంత సున్నితం అంటే...

Posted: 12/07/2016 10:06 AM IST
Lesser known facets of jayalalithaa

అప్పటిదాకా దేశంలో తిష్ట వేసిన పురుషాధిక్య రాజకీయాలకు చెక్ పెడుతూ, ఒంటి చేత్తో తమిళనాడు దశాబ్దంన్నరకు పైగా ఏలిన పురచ్ఛి తలైవి జయలలిత, ఎంత కఠినంగా వ్యవహరించేదో పలు సందర్భాల్లో బహిరంగంగానే చూశాం. క్రమశిక్షణ లేని కార్యకర్తలను అస్సలు సహించబోని అమ్మ... ఆ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది కాదు. దర్పం, ఎవరి ముందు తలొంచొద్దన్న అహం ఆమెలో ఎక్కువగా కనిపించేది. చివరకు భర్త చేసిన అవినీతికి నీడ అయిన శశికళను కూడా దూరం పెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాంటి అమ్మ మనసు ఎంత సున్నితమైందో తెలియజేసే ఓ ఘటన వెలుగు చూసింది. ఆమెకు శునకాలు అంటే ఎంతో ఇష్టం. 1998లో తన పెంపుడు శునకం ‘జూలీ’ చనిపోయింది. ఆ తర్వాత, ఆమె సన్నిహితులు ఒకరు మరో పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని నాడు ఆమెకు సూచించారు. అందుకు, జయలలిత ఏమని సమాధానమిచ్చారంటే.. ‘మరో పెంపుడు శునకం చనిపోవడాన్ని నేను భరించలేను’ అని ఆమె చెప్పారట.

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ ప్రభుత్వంలో నాడు అన్నాడీఎంకే కూడా ఉంది. నాడు జరిగిన ఒక మీటింగ్ లో పలువురు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్న సమావేశానికి జయలలిత కూడా హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఉండగానే ‘జూలీ’ చనిపోయినట్లు సమాచారం ఆమెకు తెలిసింది. అంతే ఆ వెంటనే మీటింగ్ నుంచి ఆమె అర్థాంతరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె తీరుపై పెద్ద ఎత్తున్న విమర్శలు కూడా చెలరేగాయి.

ఇక సెంటిమెంట్ల విషయంలోనూ అమ్మ అస్సలు తగ్గేది కాదు. ముచ్చటపడి చేయించుకున్న బంగారు గాజులను ఎన్నడూ వాటిని విడిచి పెట్టలేదు. ఏళ్ల తరబడి చివరికి ఖననం అయ్యేప్పుడు కూడా అవి ఆమెనే అంటిపెట్టుకునే ఉన్నాయి. వాటితోపాటు అనునిత్యం అంటిపెట్టుకుని ఉండేది మరొకటి కూడా ఉంది. అది ఆమె చేతి గడియారం. ఈ విషయం జయ నెచ్చెలి శశికళకు తెలుసు. అందుకే జయ పార్థివదేహం నుంచి గాజులను, గడియారాన్నీ తీయకుండానే ఖననం చేసినట్టు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన ఆకుపచ్చ చీరలో, ఫేవరెట్ గాజులు, గడియారాలతోనే ఆమె భూమాత ఒడిలోకి చేరిపోయింది. సాయగుణంలోనూ అమ్మ క్షణం కూడా ఆలోచించేది కాదు. పేద విద్యార్థులకు, మహిళలకు నేరుగా అపాయింట్ మెంట్ ఇచ్చే జయ, అక్కడిక్కడే వారి సమస్యలను పరిష్కరించి దేవతగా పూజలు అందుకున్న సందర్భాలెన్నో...


తెలుగంటే ఎంత మమకారం...

నటిగానే కాదు, పవర్ ఫుల్ రాజకీయ వేత్తగా కూడా జయలలిత తెలుగు ప్రజల అభిమానాన్ని చురగొంది. తెలుగు గడ్డతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్ లోని బొల్లారంలో ఆమెకు ఓ గెస్ట్ హౌజ్, వెస్ట్ మారెడ్ పల్లి రాధికా కాలనీలో ఆమెకు ఇప్పటికీ ఓ ఇల్లు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ లు మద్రాస్ లో జరుగుతున్న సమయంలో కూడా ఆమె ఇక్కడే ఎక్కువ సమయం గడిపేదని పలువురు చెబుతుంటారు. ఆమె తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. అంతేకాదు తమిళనాడు లో తెలుగు పరిరక్షణ ఉద్యమం జరిగిన సమయంలో ఆమె అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించి తన భాషాభిమానం చాటుకున్నారు.

తమిళనాడులోని హోసూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుగు ప్రజల సంక్షేమం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జయలలిత తెలుగు భాషలోనే సమాధానమిచ్చారు. ‘అన్ని భాషలు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం.. ఏం చేయాలో చెప్పండి?’ అని ఆమె అనడంతో అసెంబ్లీ సభ్యులు ఆశ్చర్యపోయారు. బల్లలు చరుస్తూ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రెస్ మీట్ లలో కూడా ‘తెలుగు’లో అడిగిన ప్రశ్నలకు జయలలిత ‘తెలుగు’లోనే సమాధానమిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఎక్కడైనా తెలుగువారు పలకరిస్తే చాలూ వారితో తిరిగి తెలుగులోనే ఆమె సంభాషించేది కూడా.

దహనం ఎందుకు చేయలేదు?

జయలలిత కన్నడ బ్రహ్మణ స్త్రీ. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను దహనం చేయాలి. కానీ, తన భౌతికకాయాన్ని సంప్రదాయ పద్ధతిలో దహనం చేయవద్దని, మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేయాలని ఆమె కోరుకున్నారట. దీంతో అమ్మ కోరిక ప్రకారమే దహనం చేయకుండా, గురువు అయిన ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు.

డీఎంకే లోనూ అభిమానులు...

జయలలిత ఒక్క అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగానే కాదు, ప్రతీ ఒక్కరూ ఆమెను తమ నాయకురాలిగా భావించేవారు తమిళనాట ఉన్న ఇతర రాజకీయ పార్టీ నేతలు. చెన్నైలో జరిగిన జయలలిత అంత్యక్రియలకు పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజలు హాజరవ్వటమే ఇందుకు తార్కాణం. పలువురు డీఎంకే కార్యకర్తలు ఈ సందర్భంగా తమ మనసులో మాటను వెల్లడించటం విశేషం. జయలలిత నిజమైన నాయకురాలని, తమ పార్టీ అధినేత కరుణానిధిని ఢీకొనే సత్తా గత నేత అని అరుంబాకంలోని తన ఇంటి బయట జయలలిత ఫొటోను పెట్టుకున్న డీఎంకే విశ్వాసపాత్రుడు ఎల్.శరవణన్ అనే వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా, డీఎంకేకు చాలా పట్టు ఉన్న చేపాక్, ట్రిప్లికేన్, అన్నానగర్, ఎగ్మోర్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎంకే కార్యకర్తలు జయలలిత అంత్యక్రియలకు హాజరవ్వటంతో అమ్మ జన నేత అన్నది స్పష్టంగా ప్రస్పుటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Amma Kindness  Jayalalithaa's sentiments  

Other Articles