పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తొలిసారి స్పందించిన కేంద్ర మాజీ అర్థికశాఖ మంత్రి చిదంబరం.. తాము కానీ కాంగ్రెస్ కానీ పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించడం లేదని, అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రం పరిగణలోకి తీసుకుని వెంటనే వారి సమస్యలను పరిష్కారించాలని, ప్రజావసరాలకు అవసరమైన మేరకు నోట్లను అందించాలని డిమాండ్ చేశారు. తాము దేశంలో పెరిగిపోతున్న అవినీతి వ్యతిరేకమనే చెప్పారు..
అయితే రెండు సారి సుమారుగా 35 రోజుల తరువాత స్పందించిన ఆయన మళ్లి తెరపైకి వచ్చిన ఆయన.. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఈ ఏడాదిలోనే అతిపెద్ద కుంభకోణమని అరోపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వ ఘోర తప్పిదమని అరోపించిన ఆయన ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిందని ఆయన విమర్శలు గుప్పించారు.
పాత పెద్ద నోట్లు స్థానంలో తీసుకువచ్చిన కొత్త పెద్దనోటు ఉగ్రవాదుల వద్ద లభిస్తున్నాయని.. కానీ దేశంలోని పెదేలకు మాత్రం ఇది చిక్కడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పారదర్శకతకు కూడా ఈ కోత్త నోట్ల పంఫిణీ అద్దం పడుతుందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశ ప్రజలందరూ తమ అవసరాలకు డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఏటీయంల ముందుకు క్యూ కడుతున్నారని, అయితే నల్ల కుభేరులు మాత్రం దొడ్డిదారిలో కోట్ల రూపాయల కోత్తనోట్లు తెచ్చుకోవడంలో సఫలీకృతులయ్యారని అయన దుయ్యబట్టారు. కేంద్రం నిర్ణయం వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు.
బ్యాంకుల ఎదుట చెంతాడంత క్యూలో నిల్చున్న పేదలు, సామాన్యులకు మాత్రం బ్యాంకులు కేంద్రం అదేశానుసారం ఇవ్వాల్సిన 24 వేల రూపాయలను ఇవ్వడం లేదని, దీని వెనుక కూడా పెద్ద కుట్రదాగి వుందని అయన అరోపించారు. ప్రజలు తాము శ్రమించిన డబ్బులను పోందేందుకు పనులు, ఉద్యోగాలు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మండిపడ్డారు.
ప్రపంచంలోని ఏ దేశంలోనూ పూర్తిగా క్యాష్లెష్ ఎకానమీ లేదని, ప్రభుత్వ నేతలు మాత్రం మనదేశంలో 100 శాతం నగదురహిత లావాదేవీలు జరగాలని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. భారత్లో 100శాతం నగదురహిత లావాదేవీలు జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో పేదలు ఎన్నో బాధలు పడుతున్నారని అన్నారు. ఇది ఎన్డీఏ సర్కారు తీసుకున్న అసంబద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించలేక రాజీపడుతూ, కష్టాలు పడుతూ ప్రజలు బతికేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
పెద్దనోట్ల రద్దు విషయం కొందరికి ముందే తెలిసిందని, పెద్దమొత్తంలో రూ.2000 కొత్త నోట్లు పట్టుబడడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎదుర్కునే ఇబ్బందుల కంటే ఇప్పుడు ఎదుర్కుంటున్న ఇబ్బందులే అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీర్ఘకాలంగా ప్రతికూల ప్రభావాలు ఎదుర్కుంటామని చిదంబరం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more