మొగుడు కాదు మదమృగం.. స్నేహితులతో కలసి.. Newly married woman gangraped by husband, friends in Ranchi

Newly wed woman gangraped by husband friends in jharkhand

rape in ranchi, rape in jharkhand, gangrape in ranchim gangrape in jharkhand, rape, gangrape, newly wedded woman, husband and friends, ranchi, husband friends rape newly married woman, husband friends rape newly wed woman, friends wife gangraped, husband and friends gangrape

A newly married woman was allegedly raped by her husband and his two friends at gun point at Rahaiya village in Palamau district, a police officer today said.

మొగుడు కాదు మదమృగం.. స్నేహితులతో కలసి.. x

Posted: 12/17/2016 10:15 AM IST
Newly wed woman gangraped by husband friends in jharkhand

భార్యభర్తల మధ్య మంగళ ప్రదంగా జరగాల్సిన శుభకార్యమది. ఎవరి సంస్కృతీ సంప్రదాయం కట్టుబాట్ల ప్రకారం వారు ఈ వేడుకను అత్యంత రహస్యంగా జరుపుకుంటారు. కానీ ఆ కార్యాన్ని కూడా బూతుపురాణంగా మార్చడమే కాకుండా తన స్నేహితులతో కలసి పంచుకున్న ఓ దుర్మార్గుడి వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యను తుపాకీతో బెదిరించి తన స్నేహితులతో శృంగారంలో పాల్గోనాలని డిమాండ్ చేసిన భర్తను అ పదంతో ఉచ్చరించడం కూడా తప్పే. తన భార్య తనకే సొంతం అనుకునే మగాళ్త మధ్య ఇలాంటి మదమృగాళ్లు కూడా వుంటాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.

అంతటితో అగకుండా పరాయి మగవాళ్లు తన భార్యపై అత్యాచారం చేస్తున్న క్రమంలో అమై అరచిన అరుపులను, వేసిన కేకలను, ప్రతిఘటించిన వైనంతో పాటు పోరాడి ఓడిన తతంగాన్ని కూడా భర్తే స్వయంగా వీడియోలో రికార్డు చేశాడంటే వీడు అసలు మనిషేనా అన్న అనుమానం కలగక మానదు. జార్ఖండ్ రాష్ట్రంలోని పల్మావు జిల్లాలోని రహయ్యా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక డీఎస్పీ హీరాలాల్ రవి తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయిందని.. తన భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడని తెలిపారు.

ఈ క్రమంలో ఒక రోజు పీకల వరకు మద్యం సేవించిన తన భార్యపై అప్ఝల్ అన్సారీతో పాటు అతడి స్నేహితులు అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. ఆ రోజు రాత్రి బాగా పోద్దుపోయిన తరువాత తన స్నేహితులు బబ్లు సింగ్, అఫ్జల్‌ మియాలతో కలిసి అన్సారీ ఇంటికి వచ్చాడని, ముందుగా అతడే తన భార్యపై స్నేహితుల ఎదుట అత్యాచారం చేశాడని, ఆ తరువాత తన స్నేహితులను తన భార్యపై అత్యాచారానికి పురమాయిండాడని,  బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని డీఎస్సీ తెలిపారు.
 
అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారాన్ని తన భర్త అన్సారీయే వీడియో తీయించాడని కూడా బాధితురాలు తెలిపిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడని కూడా తెలిపిందని పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని ఎదుర్కోన్న మరుసటి రోజు ఉదయం ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని.. తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి విషయాన్ని చెప్పడంతో వాళ్లు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే.. స్థానిక పోలీసు అధికారి మాత్రం కేసు పెట్టకుండా వాళ్లను వెనక్కి పంపేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  newly wedded woman  husband and friends  ranchi  jharkhand  

Other Articles