పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఒక్కసారిగా కరెన్సీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడటంతో తొలుత కొన్న రోజులు సేవలందించిన ఏటీయం సెంటర్లు కూడా వెక్కిరించడం ప్రారంభించగానే.. బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చునేందుకు పోటీపడుతూ వస్తున్న జనం.. ఒక్కసారిగా తోసుకోవడంతో క్యూ లైను నుంచి బయటపడిన ఓ పెద్దాయన.. తనను లైనులోంచి తోసేసారని, తన స్థానం ఎక్కడో చెప్పాలని అర్థిస్తూ.. క్యూలో నిల్చున్న తోటివారిని అడుగుతూ.. అందుకు బదులు రాకపోవడంతో చేసేది లేక అలానే అర్థిస్తూ విలపించిన పెద్దాయన.. మాజీ సైనికుడు.. గుర్తున్నాడు కదూ.. అతనే నందూలాల్.
పెద్దనోట్ల రద్దుతో కేవలం నల్లధన కుబేరులను మాత్రమే ఏడిపిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు.. నీటీమూటలుగానే మారుతున్నాయని, అయతే క్యూలైన్లో వేచివున్న పేదలు, సామాన్యులు. దినసరి కూలీలు, కార్మికులు రైతులు, కార్మికులు, కర్షకులు మాత్రమే అటు విదులకు వెళ్లలేక, క్యూ లైన్లలో తమకు అవకాశం వస్తుందో రాదో తెలియక.. మరుసటి రోజు ఆ పై మరుసటి రోజు.. ఇలా అనేక పర్యయాలు.. అయినా బ్యాంకు అధికారులు తమకు కావాల్సినంత కాకుండా వారు నిర్ధేశించినంత మాత్రమే డబ్బును ఇవ్వడంతో ఏడుస్తున్నదెవరు..?
తమ డబ్బులను తాము డ్రా చేసుకోలేని దర్భుర పరిస్థితులకు మూలం ఎవరు..? తమ ఖాతాలో డబ్బులున్నా.. తీసుకుని చూసుకోలేని పరిస్థితులకు దుర్భర స్థితికి అజ్యం పోసిందెవరు..? అంటూ పత్రికలలో అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో నందూలాల్ అవేదన మాత్రం యావత్ దేశప్రజలను కుదిపేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రతికలలోనూ దేశ ప్రజలందరికీ పరిచయమైన నందూలాల్ వయస్సు సుమారు 79 ఏళ్లు. ఈ వయస్సులోనూ తనకు ప్రజల నుంచి వస్తున్న విరాళాలను తీసుకోకుండా తనకు తన పెన్షన్ డబ్బులు వచ్చాయని.. ఇక తనకు ఎవరి సాయం అవసరం లేదని చెప్పాడు. తనలోని ఔనత్యాన్ని, అత్మాభిమానాన్ని మరోమారు చాటుకున్నాడు.
ఎండ, వాన, చలి అన్ని వేళల్లో.. జమ్మూకాశ్మీర్, సహా పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో దేశానికి సేవలందించిన యోధుడు.. చేచి చాచి తీసుకోవడమంటే తన ఆత్మాభిమానాన్ని కొల్పోవడమేనని భావించాడేమో అందుకనే అతనికి సాయం చేస్తామన్న చేతులను వద్దన్నాడు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఢిల్లీ హర్యానా విభాగం అధ్యక్షుడు కల్నల్ (రిటైర్డ్) అజిత్ సింగ్ రాణా వచ్చి సాయం చేస్తానని చెప్పినా తన నిర్ణయానికి తాను కట్టుబడ్డాడు. తన పెన్షన్ను తనకు వచ్చిందని.. అందుచేత తనకు ఎవరి సాయం వద్దని చెప్పాడని రాణా తెలిపారు. దాదాపు 30 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఒక పాపను దత్తత తీసుకుని అమెను పెంచి పెద్ద చేసి పెళ్లీడు రాగానే వివాహం చేసి పంపాడని, తన దత్తాకూతరు వారింటికి రమ్మని ఎన్నిసార్లు అర్థించినా తన ఆత్మభిమానం దెబ్బతింటుందని నందులాల్ వెళ్లలేదని స్థానికులు తెలిపారు.
అయితే తన పెన్షన్ తనను ఎందుకు విత్డ్రా చేసుకోలేనని నందలాల్ ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేసే ముందు ప్రభుత్వం.. ముందస్తు చర్యలు తీసుకోకపోతే.. ప్రజలు ఇళ్లు వాకిల్లు వదలి బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యూలైన్లలో వేచి వుండాలా అని నిలదీశారు. కాగా నందులాల్ వెళ్లిన స్టేట్ బ్యాంకు మేనేజర్ రఘువీర్ సింగ్ రాణా మాత్రం.. ఇప్పటికే ఆయనకు ఒకసారి రూ. 10 వేలు, మరోసారి రూ. 5వేలు ఇచ్చామని అన్నారు. ఇటు మీడియా, అటు సోషల్ మీడియాలో నందులాల్ హైలైట్ కావడంతో బ్యాంకు అధికారులు అయనకు అక్రాస్ ది కౌంటర్ సేవలందించేందుకు సిద్దమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more