ఓ అగంతకుడి నుంచి గుర్తుతెలియని కాల్ వచ్చింది. ఎవరో పనిమీద చేసుంటారులే అనుకుని ఎత్తగానే.. అవతలి వైపు నుంచి ఎన్నడూ లేని విధంగా, అభ్యంతరకర రీతిలో ప్రశ్నలు వినిపిస్తే.. ఏ మహిళ అయినా ఏంచేస్తుంది..? షాక్ కు గురవుతుంది. తేరుకోగానే ఫోన్ కట్ చేస్తుంది. ఇదే జరిగింది శ్రీలక్ష్మీ సతీష్ కూడా. ‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత, రూ. 3000కు వస్తావా, హోటల్ గది బుక్ చేయమంటారా’.... విద్యా సంస్థ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్న కేరళ వనిత శ్రీలక్ష్మీ సతీష్ కు వచ్చిన ఫోన్లలో వినిపించిన మాటలు ఇవి. ఆమెకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు.
ఇవన్నీ భరించలేక ఆమె సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్ చేసిన వారికి ఫోన్ నెంబర్ అధారంగా గుర్తించింది. తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకుంది. అంతే ఆ పార్టీకి చెందిన నాయకులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో రాజీ కుదర్చుకోవడం ఇద్దరికీ మంచినద్నారు. అయితే ఆ యువనాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించాలని శ్రీలక్ష్మీ విధించిన షరతుకు కూడా వారు అంగీకరించారు. అయితే ఈ మేరకు అమెకు పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమైంది.
ఇంతలో నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. అయితే శ్రీలక్ష్మీ మరో షరతును విధించగా, నిందితుడి తండ్రి అఘమేఘాల మీద వెళ్లి షరతును పూర్తి చేశాడు. అదేంటంటే.. ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని అమె కోరాగా, దానిని చెల్లించి ఆ తరువాత దానికి సంబంధించిన రసీదు కూడా అమెకు అందించాడు. అయినా తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి తన ఫేస్ బుక్ పేజీలో వివరంగా రాశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more