దివ్య దర్శనం ఫ్రీ యాత్ర మొదలైంది.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే... | AP government launches Divya Darshanam Scheme.

Divya darshanam officially launched

Divya Darshanam Scheme, Andhra Pradesh, Chief Minister Chandrababu Naidu, Chandrababu Naidu Divya Darshanam, Divya Darshanam Scheme details, Enrollment for Divya Darshanam Scheme, Divya Darshanam Scheme enrollment

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu inaugurated Divya Darshanam Scheme in Vijayawada.

ITEMVIDEOS:దివ్య దర్శన పథకం మొదలుపెట్టేశారు

Posted: 01/02/2017 11:29 AM IST
Divya darshanam officially launched

కొత్త సంవత్సరం కానుకగా పేద హిందువులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానుక అందించింది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను ఫ్రీ దర్శించుకునేందుకు ప్రభుత్వం తరపున 'దివ్య దర్శన' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా దర్శించుకోవచ్చు. ఐదు రోజుల పాటు ఈ దివ్యదర్శన యాత్ర కొనసాగుతుంది.

వివిధ ఆలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా అందే ఆదాయంతో నిరుపేదలకు ఈ ఉచిత దర్శనం కలిపించనున్నారు. ఈ పథకంలో ఒక్కో మండలం నుంచి ఒకే విడతలో 200 మంది చొప్పున రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం కల్పిస్తారు.

 

దివ్యదర్శనం ఎవరికంటే...
పేద హిందువులు, ఆదాయ రేఖకు దిగువన ఉండేవాళ్లు సరైన పత్రాలను సమర్పించి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆపై వాళ్ల పేర్లతో జాబితా తయారు చేయించి అర్హులైన వారికి మాత్రమే సదుపాయం కల్పిస్తారు. లక్కీ లాటరీ ద్వారా వచ్చిన వాళ్లకి ఇందులో చోటు కల్పిస్తారు. 18 నుంచి 80 ఏళ్లలోపు ఎవరైనా సరే సంబంధిత సైట్ లోగానీ, మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న బాక్స్ లలో గానీ తమ పేర్లను అందులో వేస్తే సరిపోతుంది. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

- ఏపీలోని 8 ప్రముఖ ఆలయాలను ఉచితంగా సందర్శించుకోవచ్చు.
- రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ పథకం కింద ఉచిత ప్రయాణం, వసతి, భోజనం, దైవ దర్శనం కల్పిస్తారు.
- ప్రతి జిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది.
ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... భక్తులను తమ ఇంటికి వచ్చిన అతిథులుగా దేవాదాయ శాఖ చూసుకోవాలంటూ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Divya Darshanam Scheme  Inaugurated  Vijayawada  AP CM Chandrababu Naidu  

Other Articles