ఒకే రోజు సుప్రీం కోర్టు రెండు షాకింగ్ డెసిషన్ లు | SC on secular election exercise and sacked Anurag Thakur.

Supreme court two shocking decisions

Supreme Court of India, Anurag Thakur , SC on secular Voting, Religion votes, BCCI President, Anurag Thakur sack, Anurag Thakur BCCI, Supreme Court Anurag Thakur, Board of Cricket council of India, Anurag Thakur oust, Supreme Court on Elections

Supreme Court ruled Politicians can't seek votes on the basis of religion. And Sacks Anurag Thakur as BCCI President.

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాలు

Posted: 01/02/2017 12:01 PM IST
Supreme court two shocking decisions

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం రెండు సంచలన తీర్పులు వెల్లడించింది. కుల, మత ఓట్లను ఎన్నికల్లో వాడుకోకూడదంటూ పార్టీలకు, నేతలకు ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు తమ ఆదేశాలను పాటించకుండా మొండివైఖరితో ముందుకెళ్తున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను తొలగిస్తూ తీర్పు వెల్లడించింది.

చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అధ్యక్షతన ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. కుల, మత, జాతి,తెగ మరియు భాషలను అడ్డుపెట్టుకుని ఓట్ల వెనకేసుకోవాలన్న సంప్రాదాయానికి తెరదించాలని పేర్కొంది. మనిషికి, దేవుడికి సంబంధం వ్యక్తిగతం. దానిని ఇలా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలను విడగొట్టి పాలించొద్దంటూ సూచించింది. ఆ పని చేసి కొందరు లబ్ధి చేకూర్చుకోవాలని భావిస్తున్నారు. తద్వారా లౌకిక వాదానికి మచ్చ తెస్తున్నారు. అది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధం.

తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంది. అది ఏ మతం మీదో, కులం మీదో ఆధారపడి ఉండదంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. కుల, మత, జాతి పరమైన వ్యాఖ్యలు చేసే వారిని ఎన్నికల నుంచి తప్పించటమే కాదు, భవిష్యత్తులో పోటీ చేయకుండా కూడా చూడాలంటూ ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం, సరిగ్గా రేపు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ రిటైర్డ్ అవుతున్న తరుణంలోనే ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అనురాగ్ తొలగింపు...
ఇక సుప్రీం అనుకున్నంత పనీ చేసింది. బీసీసీఐకి పెద్ద షాకే ఇచ్చింది. తమ ఆదేశాలను పాటించకుండా, మొండి వైఖరితో ముందుకెళుతున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ను ఆ పదవి నుంచి తొలగించింది. అతనితో పాటు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కేపై కూడా వేటు వేసింది.

Anurag Thakur BCCI sacked

లోథా కమిటీ సిఫారసులను అమలు చేయాలని తాను ఆదేశించినప్పటికీ... బీసీసీఐ పట్టించుకోకపోవడంతో, సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. తన ఆదేశాలను పాటించకపోతే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరికలు పంపింది. త్వరలోనే ఈ పదవులను కొత్తవారితో స్వయంగా సుప్రీంకోర్టు భర్తీ చేయనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  India  caste and religion votes  BCCI Chairman  Anurag Thakur  sack  

Other Articles