జగన్ ను ఫ్లోలో బూతు మాట అనేసిన జేసీ | JC Diwakar Reddy seriously criticized Jagan.

Jc diwakar reddy again fire on ys jagan

TDP MP JC Diwakar Reddym JC Jagan, JC Diwakar Reddy, JC vulgar comments, Diwakar reddy YS Jagan, YS Jagan JC Diwakar reddy, Muchumarri meeting, Muchumarri Chandrababu Naidu, Muchumarri Kurnool, Muchumarri Jagan, Muchumarri JC comments, JC Diwakar reddy YSRCP, JC criticism on Jagan

TDP MP JC Diwakar Reddy Vulgar Comments on YS Jagan at Muchumarri meeting.

జగన్ పై జేసీ కి ఎందుకంత కోపం?

Posted: 01/02/2017 04:05 PM IST
Jc diwakar reddy again fire on ys jagan

తమ పార్టీని కూడా వదలకుండా వివాదాలతో తరచూ ఇబ్బందులకు గురిచేసే టీడీపీని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా ఆయన ప్రతిపక్షనేత జగన్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నామధ్యే కుల సంబంధిత కామెంట్లు చేసిన ఆయన ఈసారి కాస్త శృతి మించి వ్యాఖ్యలు చేశాడు.

ఎంత సేపూ తిట్లేనా? పోలవరం మీద విమర్శలు చేస్తాడు? అంటూ జగన్ పై ఎంపీ జేసీ ఫైరయ్యాడు. 'రాయలసీమకు ఏం కావాలో జగన్ అడగాలి కానీ విమర్శలు ఎందుకు? విమర్శల వల్ల ఏమొస్తుంది?' అన్నారు. తర్వాత మళ్లీ తనే చెబుతూ, 'జగన్ ను వాడు అనడానికి కారణం ఏంటంటే...వాడు మావాడు' అన్నారు. 'వాడిని చిన్నపిల్లాడప్పటి నుంచి చూస్తున్నా. అందుకే జగన్ ను వాడు అంటా'నని ఆయన చెప్పారు. అందరూ కులం అంటుంటారని, కులం ఏం చేస్తుందయ్యా? ఇప్పుడు పెళ్లిళ్లకే కులం అడ్డులేదని, అలాంటప్పుడు ఓట్లేసేటప్పుడు మాత్రం కులం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

 

ఇప్పుడు ప్రజలు కూడా మారుతున్నారని, చంద్రబాబును మళ్లీ గెలిపిస్తే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని ఆయన చెప్పారు. జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలీదని, తిట్టడం తప్ప వేరేవీ తెలీదని కులం కోసం పాకులాడటం విడ్డూరం అని తెలిపాడు. ఈ క్రమంలో కాస్త ఘాటైన పదాలను కూడా జగన్ పై ఆయన ప్రయోగించాడు. సోమవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇక ఇంతకు ముందు జగన్ అసలు రెడ్డియే కాదంటూ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించటం తెలిసిందే. 2019లో కూడా వైసీపీకి భవిష్యత్తు ఉండబోదని కరాకండిగా చెప్పేశాడు కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muchumarri Project  JC Diwakar Reddy  YS Jagan  Criticize  

Other Articles