రోగి కడుపులో కత్తెర.. 18 ఏళ్లకు బయట.. వైద్యులా.. మజాకా..! Doctors remove scissors after 18 years!

Doctors remove forceps from man s stomach after 18 years

Vietnamese doctors, surgical forceps, 18 years, bizarre surgery, vietnam man forceps removed after 18 years, vietnam man forceps removed, vietnam man bizarre surgery, bizarre surgery vietnam man forceps, trending news, bizarre news, doctors news

Vietnamese doctors have removed a pair of surgical forceps left lodged in a man's abdomen for 18 years, it's reported.

రోగి కడుపులో కత్తెర.. వైద్యులా.. మజాకా..!

Posted: 01/04/2017 03:00 PM IST
Doctors remove forceps from man s stomach after 18 years

ఆ మధ్య ఓ తెలుగు సినిమాలో వైద్యుల అపరేషన్ల నిర్వాకంపై కామెడీ సీన్లు పండించారు. కడుపులో వాచీ పెట్టి మర్చిపోవడం.. రోగికి ఏం తినాలనిపించకపోవడం. దాంతో చార్జింగ్ పెట్టుకుంటేనే కడుపు నిండుగా వుండటం.. అయితే ఇలాంటి ఘటనలు సినిమాలకే పరిమితం కాదు. నిజంగా కూడా జరుగుతాయని నిరూపించారు వైద్యులు. రోగుల ప్రాణాలతో ముడిపడి వున్న సర్జరీలు చేసేప్పుడు వారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా నిర్వహించాల్సిందిపోయి ఒత్తిళ్లకు లోనైయ్యే.. లేక మర్చిపోయే రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతున్నారు. ఇలాంటివి విన్నప్పుడే అమ్మో వైద్యులా..? మజాకా..? అని అనిపించకమానదు.

సరిగ్గా ఇలాంటి ఘటనే వియత్నాంలో జరిగింది. అక్కడి వైద్యులు ఓ రోగి కడుపులో ఏకంగా అపరేషన్లకు వినియోగించే కత్తెర పెట్టి కుట్లు వేశారు. రోగి కూడా చక్కగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయాడు. తీవ్రమైన కడుపునోప్పి రావడంతో మళ్లీ అస్పత్రికి వెళ్లిన రోగిని పరిశీలించిన వైద్యులు అతని కడుపులో వున్న కత్తెరను తొలగించారు. ఇలా చెప్పడం ఈజీగానే జరిగింది కానీ, ఈ రెండింటికీ మధ్య సమయం మాత్రం 18 ఏళ్లుగా నమోదు కావడం గమ్మత్తైన విషయం. వివరాల్లోకి వెళ్తే.. వియత్నాంకి చెందిన మా వాన్‌హత్‌ అనే వ్యక్తి 1998లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు బాక్‌కాన్‌ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు అతని కడుపుకి శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో చూసుకోకుండా కత్తెరపెట్టి కుట్లు వేసేశారు.
 
ఇప్పుడు వాన్‌హత్‌కి 54 ఏళ్లు. కడుపులో అంత పొడుగు కత్తెర ఉన్నా వాన్‌హత్‌ సాధారణ జీవితాన్నే గడిపాడు. ఇటీవల అతనికి తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. సమస్యేంటో తెలీడానికి వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు. అప్పుడే వాన్‌హత్‌ కడుపులో 15 సెంటీమీటర్ల పొడవున్న కత్తెర ఉన్నట్టు గుర్తించారు.  వెంటనే వైద్యులు దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కత్తెరను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం వాన్‌హత్‌ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. చివర్లో కొసమెరుపు ఏంటంటే.. 1998లో వాన్‌హత్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడి కోసం గాలింపు జరుపుతున్నామని అధికారులు చెప్పడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vietnamese doctors  surgical forceps  18 years  bizarre surgery  trending news  

Other Articles