తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. అమ్మ మరణం తరువాత చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి చెందిన అమ్మ అభిమానులు పార్టీకి దూరమవుతున్నారు. స్వయంగా ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సినీనటుడు, ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరైన గణేష్ కూడా పార్టీకి రాజీనామ చేశారు. ఇలాంటి తరుణంలో అమ్మ మరణం వెనుక కుట్రలు జరిగాయని కూడా పలువురు అభిమానులు భావిస్తూ.. అసంతృప్తితో రగలిపోతున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి,
ఇక జయలలిత మరణించిందని వార్తలు బయటకు రాగానే విషాదసంద్రంలో మునగాల్సిన మంత్రులు, అమ్మ స్నేహితురాలు శశికళా తదితరులు అస్పత్రి వేదికగా సాగించిన హైడ్రామా.. అఘమేఘాల మీద పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం కూడా అమ్మ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో అమ్మ మరణంపై స్పష్టత కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడం.. వాటిని న్యాయస్థానం విచారణకు స్వీకరించడం.. రెగ్యూలర్ బెంచ్ కు బదిలీ చేయడం పాఠకులకు విధతమే. ఈ తరుణంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయింది.
అయితే అమ్మ అభిమానులు మాత్రం ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే నాయకత్వాన్ని అమోదిస్తారా..? అన్న ప్రశ్నలకు, పార్టీల చీలికలకు గురవుతుందా..? అన్న సందేహాలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే అమ్మకు అసలైన వారసురాలిని నేనే అంటూ అమె మేనకోడలు దీపా తెరపైకి రావడం.. అమ్మ మరణంపై సందేహాలను వ్యక్తం చేయడం జరిగిన నేపథ్యంలో దీపాకు తమిళనాట మద్దతు కూడా రోజురోజుకు పెరుగుతుంది. అమ్మ ఆస్తులకు, రాజకీయానికీ తానే వారసురాలనంటూ దీపా ఇప్పటికే ప్రకటించింది.
దీంతో అమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించేందుకు శరవేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో దీపా తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అన్నాడీఎంకే అసంతప్తి నాయకులు, ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ టీ నగర్లోని దీపా ఇంటి వద్దకు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దీపా పురట్చి మలర్ పేరవై తిరుచ్చి వేదికగా ఏర్పాటు కావడం, అమ్మ డీఎంకే చెన్నై వేదికగా నామకరణం జరగడం వెరసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దీపాను ఆహ్వానించేందుకు తగ్గ ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీపా మాత్రం తన కోసం వస్తున్న వాళ్లను ఆప్యాయంగా నమస్కరిస్తూ పలకరించి ఓపిక పట్టాలని సూచిస్తున్నారు.
జయలలిత హావభావాలతో దీపా అకట్టుకుంటుందా..?
మేనత్త జయలలితను తలపించే రీతిలో దీప వ్యాఖ్యలు, హావాభావాలు ఉన్నాయని.. తమకు అమ్మ తరువాత దీపా మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగలరని అన్నాడీఎంకే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం అభిప్రాయపడుతున్నారు. ఇక, మీడియాతో ఆమె స్పందించే తీరులో జయలలిత పోలికలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయని అభిమానులు తేల్చి చెబుతున్నారు. మేనత్త వారసురాలు తానేనని, రాజకీయాల్లో వస్తానని ఇప్పటికే దీపా చెప్పడంతో.. అమెకు రోజురోజుకు బలం పెరుగుతుంది. అభిమానులు అమె నివాసం వద్ద పోటెత్తడమే ఇందుకు నిదర్శనం.
చిన్నమ్మ శశికళ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడాన్ని అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ అనేక చోట్ల వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్యాడర్ దీపాను తమ నాయకురాలిగా అంగీకరిస్తూ.. అమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నారు. అయితే అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న దీప, వారిని సముదాయించి సమయం వచ్చినప్పుడు తప్పక వస్తానని చెబుతున్నారని సమాచారం. అయతే దీపా ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారోనని ఎదురు చూసే వాళ్ల సంఖ్య కూడా తమిళనాట పెరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more