బెంగళూర్ లో కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన లైంగిక వేధింపుల ఘటన మరవక ముందే మరికొన్ని మృగాల చేష్టలు వెలుగు చూస్తున్నాయి. బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ ముగ్గురు అమ్మాయిలపై 30 మంది కిరాతకంగా వ్యవహరించిన తీరు, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న యువతిపై అసభ్య ప్రవర్తన చూశాం. ఇక ఇప్పుడు పుణేలో జరిగిన మరో ఘటన కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో పర్వతారోహణ చేస్తున్న అమ్మాయిలను మోరల్ పోలీసింగ్ పేరిట అబ్బాయిలతో కలిసున్నారంటూ బట్టలూడదీసి మరీ కొట్టిందో ముఠా. పుణెకు 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది. తమది 'ఫోర్డ్ లవర్స్' గ్రూప్ గా చెప్పుకున్న వారు, భారత సంస్కృతిని పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ, కీచకపర్వానికి దిగారు. అమ్మాయిల వెంటవున్న వారిని కొట్టారు. వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, దౌర్జన్యం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు చిత్రాలు, వీడియోలు వీరి అకృత్యాలను చూపిస్తుండగా, ఇంతవరకూ పోలీసులు ఎటువంటి చర్యనూ తీసుకోలేదని తెలుస్తోంది. శివాజీ కోటలో ట్రెక్కింగ్ కు వెళ్లిన యువతీ యువకులపై స్థానిక యువకులు జరిపిన దాడిపై బాధిత యువతి మీడియా ముందుకు వచ్చింది.
‘‘ఆ రోజున జరిగిన దాడి గురించిన సమాచారాన్ని పంచుకుంది. "మేము 10 మంది మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోటకు వెళ్లాము. సాయంత్రం 7 గంటల సమయంలో క్యాంప్ ఫైర్ వేసుకున్న సమయంలో కోట వద్దకు శివాజీ భక్తులమని చెప్పుకుంటున్న 20 మంది 'ఫోర్డ్ లవర్స్' బ్యాచ్ అక్కడికి వచ్చింది. వాళ్లు మమల్ని నిర్బంధించారు. మేము మద్యం తాగకపోయినా, మద్యం తాగుతున్నామని ఆరోపించారు. నేను బొట్టు పెట్టుకోలేదని ఆరోపిస్తూ, నాపై దాడికి దిగారు. నేను హిందువునేనని చెబుతున్నా వినిపించుకోలేదు. రక్తం వచ్చేట్టు కొట్టారు. వేధించారు. తాకరాని చోట తాకారు. వ్యభిచారులమని ఆరోపించారు. మా గ్రూప్ లోని మిగతా అమ్మాయిలదీ ఇదే పరిస్థితి. నిబంధనలకు అనుగుణంగానే మేము వచ్చామని చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. దాదాపు ఐదు గంటల పాటు మమ్మల్ని నిర్బంధించారు. మాతోపాటు ఉన్న స్నేహితుల బట్టలు ఊడదీసి విచక్షణా రహితంగా కొట్టారు. 'శివాజీ మహరాజ్ కీ జై' అంటూనే ఈ దారుణానికి ఒడిగట్టారు.
మమ్మల్ని తీసుకెళ్లిన ఆర్గనైజర్ పై మరింతగా దాడి చేశారు. నా భర్త, ఆయన స్నేహితులు పర్వతారోహణపై శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు నేనూ ఉన్నాను. మా వెంట ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. చివరికి సమీపంలోని గ్రామస్థులు, పోలీసులు వచ్చిన తరువాతనే మాకు విముక్తి కలిగింది. స్టేషన్ కు తీసుకెళ్లి మాకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. ఆపై పోలీసులు సైతం ఫిర్యాదు చేయవద్దని ఒత్తిడి చేశారు" అని సదరు యువతి మీడియా ముందు వాపోయింది. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడుతున్న కామాంధుల ఘటనలు, ఇలాంటి వికృత పోకడలు మరింతగా పెరుగుతున్నాయన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more