రాష్ట్రంలో ఏ నేతకు కూడా సాధ్యం కానీ రీతిలో క్లిష్టమైన ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉద్ధానం కీడ్ని బాధితుల లాంటి తీవ్రతరమైన సమస్యపై పోరాటంను భుజస్కందాలపై వేసుకోవటమే కాదు, ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గడువు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న వాదనకు తెరదించుతూ ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు.
పవన్ డిమాండ్ చేసినట్లు ఉద్ధానం కిడ్నీ సమస్య 48గంటల్లో తీరేది కాదని ఆయన అంటున్నారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా పవన్ డెడ్ లైన్ పై స్పందించాడు. ఉద్ధానం కిడ్నీ సమస్య వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదన్న ఆయన కిడ్నీ బాధితులకు న్యాయం చేసే బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని ప్రకటించారు. ఏది ఏమైనా కిడ్నీ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న ఆయన, బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
అదే సమయంలో అనుకున్నంత సులువుగా సమస్యకు పరిష్కారం లభించదని, అందుకోసం దీర్ఘకాలికంగా ప్రయత్నాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. కాగా, గతంలో ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. సమస్యపై 48 గంటల్లో ప్రభుత్వం గనుక సమాధానం ఇవ్వకపోతే, తమ కమిటీ 15 రోజుల్లో సమర్పించే నివేదికతో సీఎంను కలిసి ఆపై తానే ముందుండి ఉద్యమం నడిపిస్తానని పవన్ హెచ్చరించాడు కూడా. ఇక ఇప్పుడు కిడ్నీ సమస్యలు వైద్యులకు కూడా అంతుబట్టడం లేదన్న వ్యాఖ్యలపై ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more