బెంగళూరు సఫారీలో సింహాల దాడి.. ప్రాణ‌భ‌యంతో కేకలు.. ఏం జరిగింది? | Lions attack on car in Bannerghatta forest zone.

Lion attacks car in bannerghatta national park

Lions attack on Safari Car, Bannerghatta National Park, Bannerghatta Lions Attack Video, Bannerghatta Lions, Bangalore Bannerghatta Park, Bangalore National Park

Two Lions Attack Safari Car In Bannerghatta National Park Bangalore.

ITEMVIDEOS:బెంగళూరు సఫారీలో కారుపై సింహాల దాడి

Posted: 02/01/2017 09:30 AM IST
Lion attacks car in bannerghatta national park

గతవారం బెంగ‌ళూరులోని బ‌న్నేరుఘ‌ట్ట బయోలాజిక‌ల్ పార్క్‌(బీబీపీ)లో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. సంద‌ర్శ‌కులు వెళ్తున్న ఓ కారుపై దాడి చేసిన రెండు సింహాలు లోప‌లున్న వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాయి. కారు అద్దాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన ఇనుప మెష్‌(గ్రిల్ లాంటిది) దీనికి లేక‌పోవ‌డంతో ప్రాణ‌భ‌యంతో వారు వ‌ణికిపోయారు. చివరికి కారులోని వారు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

కారుపై రెండు సింహాలు దాడి చేస్తున్న వీడియో స్థానిక టీవీ చానళ్ల‌లో మంగ‌ళ‌వారం విస్తృతంగా ప్ర‌సార‌మైంది. కారుపై సింహాలు దాడి చేస్తున్న స‌మాచారం అందుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది స‌కాలంలో అక్క‌డికి చేరుకుని వాటి బారి నుంచి కారులోని వారిని ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్టు పార్క్ అధికారులు పేర్కొన్నారు. అద్దాల‌కు మెష్‌ లేని కారు స‌ఫారీలోకి ఎలా వెళ్లింద‌నే దానిపై ఆరా తీస్తున్న‌ట్టు బీబీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ సంతోష్ కుమార్ తెలిపారు. కారుపై సింహాలు దాడి చేస్తున్న స‌మ‌యంలో డ్రైవర్ కారును ఆపి ఉండాల్సింది కాద‌ని అన్నారు.

 

కాగా, గతంలో ఇలాంటి ఘటనే సెప్టెంబర్ లో కూడా చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో డ్రైవర్ సింహాన్ని రెచ్చగొట్టడంతోనే అది దాడికి దిగింది. అయితే అదృష్టవశాత్తూ అప్పుడు కూడా ఎవరికీ ఏం కాలేదు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ను విధుల నుంచి తొలగించేశారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్ యూవీలు, ప్రత్యేక వాహనాలను తీసేసి వాటి స్థానంలో బస్సుల సంఖ్యనే పెంచే దిశగా అధికారులు యోచన చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Bannerghatta  National Park  Lions Attack  Video  

Other Articles