ఆమె మూడ్ సడన్ ఛేంజ్... మోదీ జోలికి పోదంట | Mamata Banerjee is not in an aggressive mood.

Mamata has softened her stance against modi

Trinamool Congress, Mamata Banerjee , PM Naredra Modi, Modi Mamata Benarjee, TMC MPs Budget Session, Mamata Banerjee Attack PM Modi, PM Modi Mamata Banerjee

Mamata Banerjee asks Trinamool leaders to refrain from launching personal attacks on PM Modi due to budget session.

మోదీపై దాడి జరగకుండా ఆపుతుందెవరు?

Posted: 02/01/2017 10:25 AM IST
Mamata has softened her stance against modi

సామాన్య జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షంగా తీసుకుని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నాడంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా మోదీని టార్గెట్ చేస్తూ ఆమె ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. ఎంపీలను కూడగలుపుకుని రాష్ట్రపతి దగ్గరికి మార్చ్ గా వెళ్లటం, ఒకానోక దశంలో ఏకంగా యుద్ధమే అంటూ ప్రకటించి హాట్ టాపిక్ గా మారింది.

అయితే మోదీని ఇరుకున పెట్టాలన్న ఆమె ప్రయత్నాలు కాస్త బెడిసి కొట్టడంతో ఇప్పుడు శాంతి బాట పట్టినట్లు స్పష్టమౌతోంది. గత కొంత కాలంగా స్వరాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయవద్దని తన పార్టీ ఎంపీలను ఆదేశించటమే ఇందుకు నిదర్శనం.

పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ తన ఎంపీలకు సూచించిన ఆమె... నిరసన తెలిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపిందంట. ముఖ్యంగా మోదీపై వ్యక్తిగత దాడులు చేయడం, నిందలు మోపడం చేయకూడదని సూచించినట్లు తెలుస్తోంది. భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ప్రధానిని తాను పిలిచినట్టు 'మోదీ బాబు' అని ఎవరూ కూడా సంబోధించకూడదంటూ గట్టిగానే చెప్పిందంట. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఆసక్తికర పరిణామాలకు తెరలేపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  TMC  MPs  PM Modi  

Other Articles