హేమామాలిని చూసి ఆపుకోలేక ఆ తాగుబోతు ఏం చేశాడంటే... | Drunk Man behaviour shocks Hema Malini .

Drunk man refuses to leave stage during hema malini speech

Hema Malini Drunk Man, Hema Malini UP Election Campaign, Uttar Pradesh Elections Hema Malini, Hema Malini Speech, Hema Malini Drunk Man, Drunk Man with Hema Malini, BJP MP Hema Malini, Hema Malini Hul Chul

In an awful incident, a drunk man refused to leave the stage during BJP MP Hema Malini’s election rally in Uttar Pradesh’s Mathura district. The leader who was present to woo voters for the party in upcoming assembly election asked the man to leave but he refused. Later, the man was removed from the stage after the intervention of party workers.

ITEMVIDEOS:హేమామాలిని చూసి ఆపుకోలేకపోయాడు...

Posted: 02/04/2017 09:20 AM IST
Drunk man refuses to leave stage during hema malini speech

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమామాలిని ఇప్పటికీ క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అప్పట్లో తన లాంటి స్టార్ హీరోలు ఉన్నా కేవలం ఆమె కోసమే(గ్లామర్) సినిమాలకు జనాలు వచ్చేవారంటూ అమితాబ్ చాలా సందర్భాల్లో చెప్పటం మనం చూశాం. అయితే ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ ఆమె అంటే పడిచచ్చే జనాలు ఇంకా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి డ్రీమ్ గర్ల్ కి ఓ వింత అనుభవం ఎదురైంది.

బీజేపీ ఎంపీగా ఉన్న హేమామాలిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొంటోంది. మ‌థుర జిల్లాలో శుక్ర‌వారం ఓ సభలో పాల్గొంటున్న సమయంలో ఓ వ్యక్తి స్టేజీపైకి ఎక్కి రచ్చ చేసేశాడు. శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల్లో బీజేపీకి అండ‌గా నిల‌వాల‌ని, పార్టీ అభ్య‌ర్థుల‌ను అఖండ మెజారిటీతో గెలిపించాల‌ంటూ మాట్లాడుతున్న సమయంలో అతగాడు ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. మాములుగా అయితే మనమూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతగాడు చిత్తుగా తాగేసి ఉన్నాడు.

 

మాలిని కాళ్లపై పడి దండం పెడుతూ వింత‌గా ప్ర‌వ‌ర్తించాడు. బీజేపీ నేత‌లు న‌చ్చ‌జెబుతున్నా విన‌కుండా హేమ‌మాలినితో మాట్లాడందే స్టేజీ దిగేది లేద‌ని తేల్చి చెప్పాడు. ఎవ‌రు చెప్పినా తాగుబోతు మాట వినక‌పోవ‌డంతో చివ‌రికి పార్టీ కార్య‌క‌ర్త‌లు క‌ల్పించుకుని అత‌డిని బ‌ల‌వంతంగా కిందికి దించాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఆ షాక్ నుంచి కోలుకున్న హేమ‌మాలిని త‌న ప్ర‌సంగం కొన‌సాగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MP  Hema Malini  Drunk Man  Hul Chul  

Other Articles