డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కపడుతున్నాయి. అభినవ తుగ్లక్ మాదిరి నిర్ణయాలతో అందరినీ కంగారుకు గురిచేస్తున్న ఈ అగ్రరాజ్యం అధ్యక్షుడికి షాక్ ఇచ్చింది న్యాయస్థానం. ఏడు ముస్లిందేశాల ప్రజలపై ట్రంప్ విధించిన ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ట్రంప్ కు ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది.
వివాదాస్పద నిర్ణయాలను వెంట వెంటనే అమలు చేస్తూ జోరుమీదున్న ట్రంప్‌కు ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయ్యింది. ఇస్లాం దేశాల నుంచి వలసవాదులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉగ్రవాదం సాకుగా చూపుతూ తీసుకున్న నిర్ణయంపై సియాటిల్ కోర్టు లో పిటిషన్ దాఖలైంది. దీనిని సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్, ట్రావెల్ బ్యాన్ ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్ ను దాఖలు చేసింది వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్. కోర్టు ఆదేశాలపై స్పందించిన ఫెర్గూసన్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విజయమని అని పేర్కొన్నాడు. కాగా, తీర్పు వెలువడిన వెంటనే వైట్ హౌజ్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్ల సంక్షేమం కోసమేనని, దేశ భద్రత దృష్ట్యా ఆ ఆదేశాలు జారీ చేయటం జరిగిందని, కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
మరో వివాదాస్పద నిర్ణయం?
'మత స్వేచ్ఛను గౌరవించేందుకు ప్రభుత్వ చొరవ' పేరుతో ఆదేశం ముసాయిదా కూడా తయారైనట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అదే జరిగితే వ్యక్తులు, సంస్థలు, మత ప్రాతిపదికన ఉద్యోగాలను, సేవలను, ఇతర ప్రయోజనాలను నిరాకరించవచ్చని తెలిపాయి. కొన్ని రకాల సేవలు అందించేందుకు మతపరమైన అభ్యంతరాలు ఉన్నాయని, వాటికి చట్టపరమైన రక్షణ కల్పించాలని మితవాద క్రైస్తవులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ తాజాగా జారీచేయాలని భావిస్తున్న ఆదేశాలతో వారి డిమాండ్ నెరవేరేలా కనిపిస్తోంది.
అయితే ఆదేశాలు అమలులోకి వస్తే గనుక మత స్వాతంత్ర్యం, గే హక్కుల తదితరాలపై మరోమారు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు క్రైస్తవేతరులకు ఉద్యోగాలను నిరాకరించే అవకాశం ఉందని కూడా పత్రికలు హెచ్చరించాయి. ట్రంప్ ఆదేశాలపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ సెక్రటరీ సీన్ స్పైసర్ స్పందిస్తూ అటువంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచన ట్రంప్ కు లేదని కొట్టిపడేశారు.
పోలింగ్ లో షాక్...
ట్రంప్ పగ్గాలు చేపట్టి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే అమెరికన్ల మనసులు మారిపోయాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తిరిగి అధ్యక్షుడు అయితే ఎంత బాగుండునో అంటూ అమెరికన్లు తమ మనోగతాన్ని బయటపెట్టారు. పబ్లిక్ పాలసీ పోలింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఎక్కువ మంది అమెరికన్లు తమకు తిరిగి ఒబామానే అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ను ఉన్నపళాన తొలగించాలని ఎక్కువమంది ఓటర్లు కోరుకుంటున్నారు. 52 శాతం మంది ఓటర్లు అయితే తిరిగి ఒబామానే తమకు అధ్యక్షుడిగా కావాలని కోరుకున్నారు. ట్రంప్‌తో తాము సంతోషంగానే ఉన్నామని 43 శాతం మంది పేర్కొన్నారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను 47 శాతం మంది అంగీకరించగా 49 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ట్రంప్‌ను సాగనంపాలనే ఎక్కువమంది కోరుకుంటున్నట్టు పబ్లిక్ పాలసీ పోలింగ్ అధ్యక్షుడు డీన్ డేబ్నం పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more