ఎగ్జిట్ పోల్స్: అత్యధిక రాష్ట్రాల్లో పట్టుసాధించనున్న కమలం exit polls results released, bjp on upper hand in majaority states

Exit polls results released bjp on upper hand in majaority states

Uttar Pradesh elections,UP elections 2017,UP polls 2017,Punjab elections 2017,Goa elections 2017,Exit Poll,Exit Polls,Punjab Exit Poll,UP Exit Poll,Uttar Pradesh,Punjab,BJP,Poll of Exit Polls

Exit polls picturises the big populus state goes into the hands of bjp along with goa, uttarakhand, manipur. punjab goes into the hands of punjab

ఎగ్జిట్ పోల్స్: అత్యధిక రాష్ట్రాల్లో పట్టుసాధించనున్న కమలం

Posted: 03/09/2017 09:28 PM IST
Exit polls results released bjp on upper hand in majaority states

ఎంతో ఉత్కంఠభరింతంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లలో పోలింగ్ అధ్యాయం ముగిసీన తరువాత ఇక దేశప్రజలందరూ ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వ‌చ్చేశాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించే విధంగా పలు సర్వే సంస్థలు అంచానాలను విడుదల చేశాయి. అత్యధిక స్థానాలు కల్గిన ఉత్తర్ ప్రదేశ్ సహా మూడు రాష్ట్రాలలో బీజేపీ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. ఈ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చూస్తే నోట్ల ర‌ద్దు.. బీజేపీపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌న‌ట్లు తెలుస్తున్న‌ది.

యూపీ, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల విజయావకాశాలపై ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ ను  వెల్లడించాయి. ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో యూపీ, మణిపూర్‌, గోవాలో కమలం వికసించనుంది. ఉత్తర్ ప్రదేశ్ లోనూ దాదాపు పాతికేళ్ల తరువాత బీజేపి అధికారం చేజెక్కించుకొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

యూపీలో ..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ కూటమి 185 స్థానాల్లో గెలుస్తుందని ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. కాగా, ఎస్పీ కూటమి 120 స్థానాలు, బీఎస్పీ 90, ఇతరులు ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా.

మణిపూర్‌లో..
మణిపూర్‌లో BJP 25 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని  తెలిపింది. 17 నుంచి 23 స్థానాల్లో కాంగ్రెస్‌, 9- 15 స్థానాలను ఇతరులు గెలుచుకుంటారని వెల్లడించింది

గోవాలో..
గోవాలో బీజేపీ కూటమి 15 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకొని మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ కూటమి 12 నుంచి 18 స్థానాలు, ఆప్‌ 4 స్థానాలవరకూ, ఇతరులు 2 నుంచి 8 గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొంది.

పంజాబ్‌లో ..
పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 62 నుంచి 71 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుందని, అకాళీదళ్‌- బీజేపీ కూటమి 4 -7 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు 0 నుంచి 2 స్థానాలు దక్కించుకొనే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

ఉత్తరాఖండ్‌…
ఉత్తరాఖండ్‌లో బీజేపీ 46 నుంచి 53 సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌కు కేవలం 12 నుంచి 21 సీట్లు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది. బీఎస్పీ 1 నుంచి 2 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 4 స్థానాలను కైవసం చేసుకుంటారని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Exit polls  Uttar Pradesh  Punjab  Goa  Manipur  Uttarakhand  Assembly elections  

Other Articles