ఎంతో ఉత్కంఠభరింతంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎన్నికలలో ఓటరు తీర్పు ఇప్పటికే ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమైవుంది. అయితే వాటిని తెరిచి, అభ్యర్థుల భవితవ్యం ఎలావుందో చెప్పేందుకు మరో 24 గంటల సమయం మిగిలివుంది. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలతో ముందుకు వచ్చేశాయి. మరీ ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలు వున్న ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం కమలం పార్టీకే దక్కుతుందని తేల్చిచెప్పాయి. వారి వారి అంచనాలు ఎలా వున్నా.. అధికారంలోకి ఎవరు వస్తారన్న ఖచ్చితత్వంతో సర్వే చేయించి ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి లగడపాటి రాజగోపాల్.
మాజీ పార్లమెంటు సభ్యుడైన ఈయన.. గత దశాబ్ధ కాలంగా దేశంలో జరిగే అన్ని క్రీయాశీలక ఎన్నికలలో సర్వేలు చేయించి.. ఫలితాల ముందే తన అంచనాలను తెలియజేస్తుంటారు. ఈ సారి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో కమలం పార్టీ వికసిస్తుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేసినట్లుగానే లగడపాటి కూడా అంచనా కట్టారు. అయితే రమారమి మ్యాజిక్ ఫిగర్ కు చేరుకు బీజేపి పార్టీ చేరుకుంటుందని, సాధ్యమైతే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన వివరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అత్యధిక స్థానాలు పొంది అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, మ్యాజిక్ ఫిగర్ 202కి కొంచెం అటూ ఇటూగా సీట్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. లగడపాటి ఫ్లాష్ టీం ఉత్తరప్రదేశ్, పంజాబుల్లోనూ సర్వే నిర్వహించింది. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కలిసినా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణాలు అనేకం ఉన్నాయని లగడపాటి తెలిపారు. సీఎం అఖిలేశ్‌కు అవినీతి రహితుడిగా మంచి పేరున్నా సమాజ్‌వాదీపార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రె్‌సతో కలవడం, ఆ పార్టీకి 100కి పైగా సీట్లివ్వడం వల్ల కూడా ఎస్పీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఎస్పీని తన చేతుల్లోకి తీసుకున్న అఖిలేశ్‌ను యువత హీరోగా అభివర్ణిస్తోందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో మోదీ విస్తృత ప్రచారమే బీజేపీని గట్టెక్కించనున్నదని లగడపాటి అన్నారు. మొదట్లో కొంత డీలా పడ్డా మూడో దశ పోలింగ్ నుంచి ఆ పార్టీ ప్రచారం పుంజుకుందని చెప్పారు. హిందూ ఓట్ల ఏకీకరణకు మోదీ ప్రసంగాలు బాగా పని చేశాయన్నారు. రంజాన్ రోజున విద్యుత నిరంతరాయంగా ఇచ్చే అఖిలేశ్ దీపావళి రోజు ఇవ్వడం లేదని, ముస్లింలకు కబరస్తాన్ కోసం స్థలాలను కేటాయించిన ఎస్పీ ప్రభుత్వం హిందువులను విస్మరించిందని మోదీ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more