వీడు సీఈఓ కాదు.. ఇండియన్ ఉబర్.. వైరల్ పోస్టు.. TVF Chief Sexually Assaults Women Employees

Tvf chief sexually assaults women employees

The Viral Fever, chief Arunabh kumar, Sexual harassment, crime, molestation, posts on social media, Muzaffarpur, online channel, digital entertainment channels, Ex-woman employee, mumbai, sexual assult

Three former women employees have come forward to make sensational charges of molestation against The Viral Fever (TVF) Chief Arunabh Kumar.

వీడు సీఈఓ కాదు.. ఇండియన్ ఉబర్.. వైరల్ పోస్టు..

Posted: 03/14/2017 12:49 PM IST
Tvf chief sexually assaults women employees

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అందులో వైరల్ అవుతున్న వార్తలు కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పతాకశీర్షకలుగా మారుతున్నాయి. అలాంటి సోషల్ మీడియా సంస్థకు సీఈఓగా వున్న తన సంస్థలో పనిచేస్తున్న మహిళలను లైంగికదాడులకు గురిచేయడం.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి వైరల్ అవుతోంది. ప్రఖ్యాత యూ ట్యూబ్‌ ఛానల్ గా పేరుతెచ్చుకున్న ఆన్ లైన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో దేశంలోనే ఒకటిగా నిలుస్తున్న ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) వ్యవస్థాపకుడు, సీఈవో అరునబ్ కుమార్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా  ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని ఓ మాజీ మహిళా ఉద్యోగి సోషల్ మీడియాలో వివరించడంతో అది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది.
 
అంతేకాదండోయ్.. ఈ మహిళా ఉద్యోగి తన మాజీ బాస్ ను ఏకంగా భారతీయ ఉబర్ లాంటి సంస్థ టీవీఎఫ్ అని తన మాజీ సంస్థ గురించి కూడా బాగానే ఏకీపారేసింది. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుకు అటు షేర్లు, ఇటు లైకులతో పంచుకోవడంతో.. విషయం చేయిదాటిపోయింది. అయితే దీనిపై స్పందించిన సదరు సంస్థ సీఈఓ అరనబ్ కుమార్ మాత్రం తనకు తన సంస్థలోని మహిళ ఉద్యోగైనా సెక్సీగా కబడితే.. తాను అదే విషయాన్ని వారితో చెప్పేవాడినని.. దాన్ని కూడా వారు లైంగిక దాడిగా పరిగణించడం తాను విస్మయానికి గురైనట్టు చెప్పుకోచ్చారు. కాగా 'ది ఇండియన్ ఉబర్- దట్ ఈజ్ టీవీఎఫ్' పేరుతో సోషల్ మీడియాలో మాజీ మహిళా ఉద్యోగి పోస్టు చేసింది. అమెకు బాసటలో మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా తాజాగా అమె ఆరోపణలకు మద్దతును ఇచ్చారు. తాము ఇలాంటి వేధింపులకు గురయ్యామన్నారు.
 
ఆ సంస్థలో పనిచేసిన రెండేళ్లపాటు వివిధ సందర్భాల్లో అరునబ్ కుమార్ తనను చేసిన లైంగిక వేధింపులను ఆ మహిళ పూసగుచ్చినట్టు వివరించింది. ముంబాయి కేఫ్ లో కుమార్ ను కలుసుకున్నట్టు, ఇద్దరిది బిహార్ లోని ముజాఫర్ పుర్ కావడంతో వెంటనే తనతో సన్నిహితం ఏర్పడిందని తెలిపింది. తమ స్టార్టప్ లో జాయిన్ అవ్వాలని తనకు అరునబ్ సూచించాడని, అక్కడ జాయిన్ అయిన 21 రోజుల నుంచే తనపై కుమార్ లైంగిక వేధింపులు ప్రారంభించాడని పేర్కొంది. అక్కడి నుంచి రెండేళ్ల పాటు తాను చీకటి జీవితంలోనే బతికినట్టు తెలిపింది. పార్టీల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం వంటివి చేసేవాడని వివరిస్తూ తనపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Viral Fever  Arunabh kumar  Sexual harassment  social media  viral post  mumbai  crime  

Other Articles