ఎన్నికల సమరశంఖాన్ని పూరిస్తామంటున్న జనసేనాని పవన్ pawan kalyan launches janasena official website

Pawan kalyan launches janasena official website

pawan kalyan, power star pawan, janasena, janasena website, janasena portal, www.janasena.org, Andhra Pradesh, Telangana, Telugu states, cadre, 2019 elections, janasena thrid anniversary, janasena foundation day, janasena official website, politics

Actor turned politician power star pawan kalyan launches his party official website on party third anniversary day, says his party will function in full pledged manner and contest in 2019 elections.

ITEMVIDEOS: ఎన్నికల సమరానికి సన్నధమవుతున్న జనసేన.. వెబ్ సైట్ లాంచ్..

Posted: 03/14/2017 04:40 PM IST
Pawan kalyan launches janasena official website

2019 ఎన్నికలకు సన్నధం జనసేనాని సిద్దం అవుతున్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జనసేన వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. సంస్థాగతంగా పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను అందులో చేర్చనున్నారు. పార్టీ ముఖ్యకార్యకర్తల నడుమ వెబ్ సైట్ ను ప్రారంభించిన పవన్ .. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ నుంచి తమ సార్టీ వ్యవస్థాపరంగా నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తమకు బలమైన కార్యకర్తలు వున్నారని చెప్పారు.

తనకు ధన ప్రభావం లేని రాజకీయాలను చూడాలని వుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్.. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించామన్నారు. ఈ అంశాలతో రానున్న ఎన్నికలలో ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఇక తమ పార్టీకి సంస్థాగతపరంగా పటిష్టపర్చేందుకు క్షేత్రస్తాయి నుంచి నాయకులను గుర్తిస్తామని... తమ పార్టీ నాయకులకు ప్రజలతో సన్నిహిత సంబంధాలు వున్నవారై వున్నారేనని చెప్పుకోచ్చారు. యువతకు తమ పార్టీలో పెద్దపీట వేస్తున్నామని, దాదాపు 60శాతం సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. అయితే ఇదే సమయంలో అనుభవం వున్న నేతలు కూడా పార్టీకి చాలా అవసమరని గుర్తించిన ఆయన వారికి కూడా పార్టీలో తగు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.

పోత్తుపై అప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పిన జనసేనాని.. పార్టీ నిర్మాణం పూర్తైన తరువాత పోత్తుల విషయమై అలోచిస్తామన్నారు. కమ్యూనిస్టులు గానీ మరే ఇతర పార్టీలతో పోత్తు ఏర్పాటు చేసుకునే ముందు తమ పార్టీ సంస్థాగతంగా నిర్మాణమై వుండాలన్నదే తన అభిమతమని చెప్పారు. అయితే ఎన్డీఏతో ఇప్పడు మిత్రపక్షంగా వున్నారా..? అన్న ప్రశ్నకు బదులిచ్చిన పవన్.. తాను వారితో మిత్రుడిలా లేనిని తేల్చిచెప్పారు. అయితే ఇటు రాష్ట్రంలోనూ రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని చెప్పారు.

గత మూడేళ్లుగా జనసేనకు అండగా వున్నవారందరికీ కృతజ్ఞతలు చెప్పిన పవన్.. తమ పార్టీ లక్ష్యం ప్రజా సమస్యలపై పోరాటమన్నారు. అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఉత్భవించిందని చెప్పారు. కాగా, తమ పార్టీ సర్వేల అంచనాలపై అధారపడి పనిచేయబోదని.. స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తుందన్నారు ప్రజల సమస్యలను పరిస్కరించే దిశగా తమ పయనం వుంటుందని, లేకపోతే వాటిని పరిష్కరించేవరకు పోరాటం తప్పదని చెప్పారు.

రానున్న ఎన్నికల నాటికి తమ పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని, రెండు రాష్ట్రాల ఎన్నికల కమీషన్ అధికారుల నుంచి తమకు గుర్తింపు లభించిందని కూడా చెప్పారు. అయితే గతంలో పీఆర్పీ అనుభవానలు దృష్టిలో పెట్టుకుని అచితూచి అడుగులు వేస్తున్నాం.. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ధన ప్రభావం లేని రాజకీయాలంటే తనకు ఇష్టమని చెప్పుకోచ్చిన పవన్.. మనిపూర్ లో ఐరోం షర్మిల ఓటమి భాదించిందని చెప్పారు. తన సోదరుడు చిరంజీవి జనసేనలోకి రారు.. తమ ఇద్దరి అలోచనలు వేరని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను అనంతపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కూడా పవన్ తన అభిమతాన్ని వెలిబుచ్చారు.

జనసేన వెబ్ సైట్ అడ్రస్ : https://janasenaparty.org/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  website  third anniversasy  website. www. janasena.org  politics  

Other Articles