జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి.. jayasudha husband nitinkapoor suspicious death

Jayasudha husband nitinkapoor suspicious death

jayasudha, nitin kapoor, tollywood, bollywood, nitinkapoor suspicious death, mumbai

producer and popular tollywood actress jayasudha husband nitin kapoor suspicious death in mumbai. If sources are to be believed he had commited suicide due to financial problems

జయసుధ భర్త నితిన్ కపూర్ అనుమానాస్పద మృతి..

Posted: 03/14/2017 06:01 PM IST
Jayasudha husband nitinkapoor suspicious death

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటి, అలనాటి హీరోయిన్ జయసుధ భర్త నితిన్ కపూర్ (58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని తన సోదరి ఇంటిలో నివాసముంటున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం అదే అపార్టుమెంటు ఆరవ అంతస్థునుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన మరణం సహజమేనా..? కాదా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త మరణవార్తను తెలుసుకున్న జయసుధ హుటాహుటిన ముంబైకి బయల్దేరారు.

ఆయనకు అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ వార్త తెలిసి టాలీవుడ్ శోఖసంధ్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ అలనాటి హీరో జితేంద్రకు వరుసకు సోదరుడైన నితన్ కపూర్ కూడా సినీరంగంపై ఆసక్తితో బాలీవుడ్ రంగంలోకి నిర్మాతగా ప్రవేశించారు. అక్కడ సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమకు చేరువయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నితిన్ కపూర్ తొలిసారిగా అశాజ్యోతి చిత్రానికి అసిస్టెంట్ గా సేవలు అందించారు.

ఈ క్రమంలో 1985లో జయసుధతో ఆయనకు వివాహం జరిగింది. ఆ తరువాత ఆయన చిత్రసీమలో నిర్మాతగా స్థిరపడేందుకు పలు హ్యాండ్సప్, కలికాలం, మేరా పతి సిర్ప్ మేరా హైతో పాటు పలు సినిమాలను ఆయన నిర్మించారు. జేఎస్కే కంబైన్స్ పథాకంపై ఆయన ఈ చిత్రాలను నిర్మించారు. కాగా చిత్రాలన్ని ఆయనకు అర్థికంగా నష్టాలనే మిగిల్చాయి.

జయసుధ కథనాయిక పాత్రలో కొన్ని, ప్రధాన ప్రాతలో మరికొన్ని చిత్రాలను నిర్మించారు. అయితే అవన్నీ సక్సెస్ కాలేదు. కొన్న చిత్రాలు సక్సెస్ అయినా.. అశించిన స్థాయిలో కలెక్షన్లు కురిపించలేకపోయాయి. దీంతో ఆర్థికంగా నష్టపోయినా అయన గత 17 సంవత్సరాలుగా అర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారని, తరువాత ఆయన కోలుకోలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

అయితే ఆయన ఏ విషయంలోనూ ఇబ్బందులపై నోరు జారలేదని సన్నిహితులు పేర్కొన్నారు. కాగా నష్టాలను ఎదుర్కోవడంలో ఆయన జయసుధ అంతటి పరిణతి చూపించలేకపోయారని... అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ, నితిన్ కపూర్ కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నారని చెప్పారు. ఏడాదిన్నరగా సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతున్నారని తెలిపారు. ముంబైలోని తన సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్, ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayasudha  nitin kapoor  tollywood  bollywood  nitinkapoor suspicious death  mumbai  

Other Articles