కేఫ్ కాఫీ డే అనగానే మంచి బ్రాడెండ్ హోటల్.. దేశవ్యాప్తంగా అనేక చైన్ హోటళ్లు కలిగన సంస్థగా భారతీయులలో ముఖ్యంగా సంపన్న, ఉన్నత మధ్యతరగతి వర్గ ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఇప్పడు ఈ హోటల్ సిబ్బంది కస్టమర్లపై చేయిచేసుకున్న ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఓ మహిళా సిబ్బంది తనను కస్టమర్ వేధిస్తున్నాడని ఏకంగా అర్పన్ వర్మ అనే కస్టమర్ చెంప చెల్లుమనిపించింది. ఇదేమీ చోద్యం.. హోటల్ లో స్టాప్ ను వేదించడం సమంజసం కాదని, వెంటనే హోటట్ నుంచి అర్పన్ వర్మను వెళ్లిపోవాలని కూడా హోటల్ యాజమాన్యం అదేశించింది.
అయితే ఈ చర్యను కస్టమర్లు అందరూ ఖండించారు. మీ తప్పులను నిలదీస్తే.. కస్టమర్లను ఏకంగా కొడతారా అంటూ ప్రశ్నించారు. ఇంతకీ కేఫ్ కాఫీ డే యాజమాన్యం చేసిన తప్పేంటి అంటే.. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేసేందుకు నిల్వవుంచి పధార్థాలనుంచిన ఫ్రీజ్ లలో పైన కుప్పలుగా పడివున్న మెను కార్డుల కింద అనేక బోద్దింకలు వుండటాన్ని గమనించాడు అర్పన్ వర్మ. అందులోంచే పధార్థాలను తీసి తమకు వడ్డిస్తున్న క్రమంలో అర్పన్ వర్మ తన మొబైల్ ఫోన్ కు పనిచెప్పాడు. దానంతా షూట్ చేస్తుండగా, కాఫీ డే సిబ్బంది వచ్చి.. దానిని తీయవద్దని పలుమార్లు విన్నవించారు.
దీంతో కోప్రాద్రిక్తుడైన అర్పన్ వర్మ విషయాన్ని తన పక్కనున్న కస్టమర్లందరికీ తెలిపాడు. విషయాన్ని తెలుసుకున్న కస్టమర్లు సిబ్బంది వడ్డించిన పధార్థలను తీసుకునేందుకు నిరాకరించారు. కాఫీ డే లో ఇలాంది దారుణంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తారా..? అంటూ నిలదీశారు. దీంతో కాఫీ డే యాజమాన్యం రంగంలోకి దిగి వెంటనే అర్పన్ వర్మను హోటల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. అయినా అతను నిరాకరంచడంతో ఓక మహిళా కస్టమర్ వచ్చి ఏకంగా అతని చెంప చెల్లమనిపించింది. తనను వేధిస్తున్నాడని అక్రోశాన్ని వెళ్లగక్కింది.
ఈ ఘటననంతా నిఖిల్ అనంద్ సింగ్ అనే అర్పన్ వర్మ స్నేహితుడు తన మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వెంటనే మహిళా సిబ్బందిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అమె ఒడిషాకు చెందిన బలహీనవర్గ కుటుంబానికి చెందిన మహళగా చెప్పారు. ఎన్డీఓ సంస్థ గ్రామ్ తరంగ్ ద్వారా అమె ఉపాధి పొందిందని, అయితే ఉపాది కల్పించేందుకు ముందు అమె కఠోరమైన శిక్షణు కూడా పోందిందని, అమె ట్రైనింగ్ పూర్తికావడంతో అమెకు జైపూర్ లో పోస్టింగ్ ఇచ్చామని యాజమాన్యం చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కస్టమన్లతో సత్పవర్తన కలిగి వుండాల్సిన తమ సిబ్బంది ఇలాంటి చర్యలకు పూనుకోవడంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో అమెను విధులనుంచి తప్పించామని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more