అధికార పార్టీ నేతల వ్యవహార శైలిలో తప్పులు దొర్లాయంటే చాలూ దొరక బుచ్చుకుని మరీ ఏకేస్తున్నారు వైఎస్సార్సీపీ నేతలు. అంతటితో ఆగకుండా తమ మీడియా ‘సాక్షి’గా వాటిని ప్రజలకు చేరవేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత నియోజక వర్గంలో ఓ అధికారి పై దాడి గురించి హైలెట్ చేస్తూ 'పరిటాల ఇలాకాలో అరాచకం' పేరిట ఓ కథనం ప్రచురించింది. దీంతో విమర్శలు రాగా ఆమె వివరణ ఇచ్చుకుంది.
స్థానిక ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు, కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్టు గా పని చేస్తున్న మూర్తిపై దాడి చేసి చెప్పుతో కొట్టాడని, సునీత అండతోనే ముకుందనాయుడు రెచ్చిపోయాడని అందులో పేర్కొంది. పైగా బాధితునితో కలిసి కార్యాలయ ఉద్యోగులంతా జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రకు, ఆపై నేరుగా పరిటాల సునీత దగ్గరకు వెళ్లి కూడా విషయం తెలియజేసినట్లు సమాచారం. అయితే ఆమె మాత్రం విషయాన్ని లైట్ తీసుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేసినట్లు కథనం వెలువడింది.
దీనిపై పరిటాల సునీత స్పందిస్తూ... ఎంపీపీ భర్త ముకుందనాయుడు దాడి చేసిన మాట వాస్తవమే అయినా, చెప్పుతో కొట్టారన్న దాంట్లో నిజం లేదని, తాను ఈ ఇష్యూపై సీరియస్ గానే ఉన్నానని, ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని ఆమె మీడియాకు తెలిపింది. పింఛన్ల జాబితాను తయారు చేసే విషయంలో టైపిస్టుకు, ముకుందనాయుడికి మధ్య వాదనలు పెరిగిన మాట నిజమేనని, అయితే, కొన్ని టీవీ ఛానెళ్లలో చూపించినంతగా తీవ్రత ఏం లేదని ఆమె తెలిపింది. స్వయంగా మంత్రే ఈ విషయంలో జోక్యం చేసుకోవటంతో ఎంపీపీ పద్మగీత, ఎంపీడీఓ జలజాక్షి మీడియా సమావేశం నిర్వహించి, ఇకపై నేతలు, అధికారులు ఎలాంటి గొడవలు లేకుండా అంతా కలసి పని చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more