ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకేసారి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ | AP Intermediate 1st & 2nd Year Results 2017 Released.

Ap intermediate result 2017 released

AP Inter Result 2017, Andhra Pradesh Intermediate Results, Inter 2017 Results, Ganta Srinivasa Rao AP Inter Results 2017, AP Inter Results Official Website, 2017 Inter Results

AP Inter Result 2017 Announced by BIEAP of Class 10 and 12 on its official website.

ఏపీ ఇంటర్‌-2017 ఫలితాలు విడుదల

Posted: 04/13/2017 12:29 PM IST
Ap intermediate result 2017 released

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో కాసేపటి క్రితం విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను మీడియా సమక్షంలో ప్రకటించారు. ఒకేసారి ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయటం ఇదే ఫస్ట్ టైం.

రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి గంటా ఈ సందర్భంగా వివరించాడు. ఇక ఫలితాలలో 80 శాతం ఉత్తీర్ణతతో బాలికలు, 77 శాతం బాలురు నిలిచారు. ఇం‍టర్‌ ఫస్టియర్‌లో 77 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, నెల్లూరు జిల్లా (69 శాతం) ద్వితీయ, పశ్చిమ గోదావరి జిల్లా (67శాతం) తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో 86 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలవగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్ (80శాతం)‌, గుంటూరు జిల్లా (79శాతం) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాల్లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా చివరస్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు గంటా వివరించారు. ఫలితాల కోసం ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు.

 

ఫలితాల కోసం http://www.bieap.gov.in/ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Intermediate Exams  2017 Results  

Other Articles