ఫ్యూఛర్ ముఖ్యమంత్రి.. ఇంక మారడా? | Jagan warn officials as future Chief Minister.

Ys jagan again made future cm comments

Pulivendula Praja Dharbar, Future CM YS Jagan, YS Jagan Future CM, Future AP CM, Andhra Pradesh Future CM, YS Jagan Future CM, YS Jagan Mohan Reddy As CM, Jagan CM Comments, Jagab Future CM Comments, Jagan Warn Officials

Andhra Pradesh Future "Chief Minister" YS Jagan Mohan Reddy warn officials Pulivendula Praja Dharbar.

జగన్ ఇంక మారటం కష్టమే

Posted: 04/14/2017 07:59 AM IST
Ys jagan again made future cm comments

నేను మోనార్కుని.. ఎవరిమాటనూ వినను ఇది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సూటవుతుందేమో. పార్టీకి తానే అన్నీ అన్నట్లు తన పార్టీలోని సీనియర్ నాయకులను సైతం పక్కన పెడుతూ వస్తున్న జగన్ బిహేవియర్ గురించి అందరికీ తెలిసిందే. ఇది కరెక్టు కాదని పార్టీలోని ఎమ్మెల్యేలందరికి తెలుసు కానీ, చెప్పటం వీలుకానీ వాళ్లు అడ్జస్ట్ అయిపోతుంటే, కానీ వాళ్లు మాత్రం జంప్ అయిపోతున్నారు. ఇక ఎప్పటి కప్పుడు తానే కాబోయే ముఖ్యమంత్రి నంటూ సైకలాజికల్ గా అందరినీ ప్రిపేర్ చేస్తూ వస్తున్న వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది.

నోటి వెంట మరోమారు ‘సీఎం నేనే’ అన్న పదం వినిపించింది. గురువారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మండలంలోని 16 పంచాయతీల ప్రజా ప్రతినిధులు, ప్రజలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యాడు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగిన కార్యక్రమంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు జగన్ సూచించారు.

ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈపై పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చిన వారికే బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారని లేకుంటే కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన జగన్ ‘‘2019 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికే సీఎం పదవి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి’’ అంటూ హెచ్చరించాడు. ఇంతకు ముందు గణతంత్ర్య దినోత్సవం రోజు ప్రత్యేక హోదా నిరసన సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో తనని అడ్డుకున్న పోలీసు అధికారితో జగన్ కాబోయే సీఎంను టచ్ చేస్తున్నావ్ అంటూ  హెచ్చరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan Mohan Reddy  Future CM Comments  

Other Articles