కేసీఆర్ కోరిక నెరవేరదా? ఇంతకీ ఏం చేయబోతున్నారంటే... | BJP core meeting against KCR Muslim quota decision.

Bjp braces for fight against telangana muslim quota

Muslim quota, Muslim quota. Telangana, BJP Muslim quota, BJP Telangana, Muslim quota.Assembly Session, Telangana Assembly Special Session, Vote Bank Politics, TRS BJP Fight Muslims, Telangana Muslims Quota BIll

BJP braces for fight against Muslim quota. BJP accuses TRS of vote-bank politics over quota issue. 12 percdnt quota will end TRS govt. TRS hits out at BJP for criticism on quota.

ముస్లిం రిజర్వేషన్లు అడ్డుకోవటం ఎలా?

Posted: 04/14/2017 08:27 AM IST
Bjp braces for fight against telangana muslim quota

ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్ల పెంపు చేసి తీరతానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయబోతుందన్నది మాత్రం తేటతెల్లమౌతోంది. అయితే మిగతా పార్టీలు సహకారం అందిస్తాయని, బిల్లులు ఏకపక్షంగా ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానన్న టీ సీఎం, ఒకవేళ అవసరమైతే ఈ విషయంలో అడ్డుకునే వారితో వార్ చేయటానికైనా సై అంటూ ప్రకటించటం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉంటే ఎలాగైనా దీనికి అడ్డుపుల్ల వేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాదులో కోర్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కేసీఆర్ అమలు చేస్తామంటున్న ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడం ఎలా? అన్నదానిపైనే సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు దేశానికి అసలు మంచిది కాదన్నది వారి వాదన. ఇలాంటి విధానాలు తిరోగమనానికి సూచికలని తెలంగాణ బీజేపీ శాఖ అభిప్రాయపడుతోంది.

ఇంకోపక్క ఇదే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల పెంపు చేయాలన్న కేసీఆర్ ప్రయత్నానికి ఇది ఆటంకంగా మారే అవకాశం ఉంది. దీంతో కేంద్రంతో ఢీ అనేందుకు కూడా సై అన్న సంకేతాలు కేసీఆర్ పంపినట్లు సమాచారం. మొత్తానికి రిజర్వేషన్ల కోసమే ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతుండటం, అంతకు ముందే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ కోర్ మీటింగ్... జరగబోయే ఆసక్తికర పరిణామాల కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Muslims Quota Bill  BJP  Assembly Session  

Other Articles