శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ వ్యవహారం ఢిల్లీ నుంచి తిరిగి తమిళనాడుకు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులను పావులుగా వాడుకుంటూ బీజేపీ యే తమిళ రాజకీయాలతో ఆటాడుకుంటోందని డీఎంకే సహా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నైకి తరలించి అక్కడే దినకరన్ ను విచారిస్తున్నారు. ఈసీకి లంచంగా ఇవ్వాలనుకున్న 50 కోట్ల సొమ్మును తన స్నేహితుడు మల్లికార్జున్ ద్వారా ఏజెంట్లకు పంపిణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
అలాగే మాజీ ఐఏఎస్ మోహన్ రంగం ఇంటికి వెళ్లి గంటలకు పైగా విచారణ జరిపారు. నగరంలో ఉండే మరో సీనియర్ ఐఏఎస్‌ను కూడా రహస్యంగా విచారించారు. శుక్రవారం ఢిల్లీ పోలీసులు నరేశ్ అనే హవాలా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే దినకరన్ బ్రోకర్ సుఖేశ్ చంద్రకు రూ.10 కోట్లు పంపి ఎన్నికల అధికారులతో బేరసారాలు సాగించినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అమ్మ వర్గం రెండుగా చీలాక దినకరన్ కు మద్ధతు ఇచ్చిన కొందరు మంత్రులు ఆర్కే నగర్ బరిలో నిలిపేందుకు డబ్బులు పెట్టడం వెలుగు చూసింది.
ఐదుగురు మంత్రులతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తలా ఓ చెయ్యి వేసినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. వీరిని క్లోజ్ గా ఉండి విచారణ జరిపేందుకు దినకరన్ ను చెన్నై కి తరలించినట్లు అర్థమౌతుంది. పార్టీ రెండాకుల గుర్తును నిలపుకునేందుకు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం అధికారులకే లంచం ఇవ్వజూపాడు. అడ్డంగా బుక్కయి ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల చేతిలో బంధీగా ఉన్నాడు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
మొత్తానికి దినకరన్ కేసులో మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో వారిని సాధ్యమైనంత దూరం పెట్టి తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని సీఎం పళనీస్వామి నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అరెస్ట్ దాకా పరిస్థితి వెళితే మాత్రం వారిని తొలగించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడంట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more