పాకిస్థాన్ లో చిక్కకుపోయిన ఇండియన్ యువతి ఉజ్మా ఉదంతం మలుపు తిరిగింది. సాయం చేస్తామంటూనే అక్కడి అధికారులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. తాను ఇటీవలే వివాహమాడిన యువతిని పాకిస్థాన్ లోని ఇండియన్ దౌత్య కార్యాలయంలో బంధించారని ఓ వ్యక్తి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఉజ్మా మాత్రం మోసపోయి తాను ఇండియాకు వెళ్లటానికే ఇక్కడికి వచ్చానని చెప్పటంతో విషయం ఇరు దేశాల విదేశాంగ శాఖలు జోక్యం చేసుకునేదాకా వెళ్లింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ఇస్లామాబాద్ కోర్టు ఆదేశాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. భారత దౌత్య కార్యాలయ సెక్రటరీ సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. అంతేకాదు కేసు విచారణ జరిగే వరకు నగరం విడిచి రాదన్న ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది...
న్యూఢిల్లీకి చెందిన ఉజ్మా, తహీర్ ఇద్దరూ మలేషియాలో కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఉజ్మా మే 1న వాఘా సరిహద్దు దాటుకుని పాకిస్తాన్ చేరకుంది. మే 3వ తేదీన ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే తహిర్ కధనం మేరకు దౌత్య కార్యాలయానికి వెళ్ళి అక్కడ వీసాకోసం దరఖాస్తు చేసుకోవాలని యత్నిస్తే లోపలికెళ్లిన భార్య ఎంతసేపటికి తిరిగి రాకపోయే సరికి అధికారులను విచారించానని తహీర్ చెప్పాడు. చివరకు ఆమెను బంధించారని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారి జాకిరియా ప్రకటన చేసి దుమారం రేపాడు.
కానీ, తలకు తుపాకీ గురిపెట్టి అలీ తనను వివాహమాడాడని అతని భార్య ఉజ్మా(20) ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. అలీ తన ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సైతం లాక్కున్నాడని పేర్కొంది. తనను స్వదేశం ఇండియాకు తనను తిరిగి పంపించాలని కోరింది. మరోవైపు ఉజ్మా కేవలం విజిటింగ్ వీసాలతోనే తమ దేశంలోకి అడుగుపెట్టినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. భారత్ దౌత్య కార్యాలయాన్ని త్వరలోనే సంప్రదించి సమస్యను పరిష్కరిస్తుందని ముందు చెప్పిన అధికారులు, తర్వాత ఇలా మాట మార్చి ఫోన్ ను స్వాధీన పరుచుకోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more