అదోక టీవీ కేంద్రం.. ఛానెల్ లో బులెటిన్ సమయం కాగానే.. పీసీఆర్ లోకి వెళ్లిన ఓ యాంకర్ సిరీయస్ గా వార్తలు చదువుతుంది. సరిగ్గా అమె ఓ సిరియస్ అంశానికి సంబంధించిన వార్తలను చదువుతుంది. అది కూడా మాస్కో నగరంలోని కూల్చివేత ఘటనపై అమె చెబుతున్న క్రమంలో ఓ పదిహేను నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఆ అంతరాయానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. అంతరాయానికి కారణం ఎవరన్న విషయం తెలియదు కానీ.. మొత్తానికి ఈ అంతరాయం వల్ల ఆ టీవీ ఛానెల్ కు మంచే జరిగింది.
అంతరాయం ఎందుకు ఏర్పడిందో చెప్పండ్రా బాబూ..? అని అంటున్నారు కదూ.. యాంకర్ లైవ్లో సీరియస్గా వార్తలు చదువుతున్న క్రమంలో అమెకు వెనుక నుంచి ఓ భీకర శబ్దం చిన్నగా వినిపించింది. ఆ తరువాత డెస్క్ కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దాంతో కంగారుపడిన యాంకర్ లైవ్ జరుగుతుండగానే.. ఇదేదో జంతువు అరుపులా వుందని హఠాత్తుగా కిందకు చూసింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా పీసీఆర్ గదిలోకి అనుకోని అతిధి అమె కోసం వచ్చేసింది.
అ అతిధి వేరేవరో కాదు శునకం. అవునండీ ఏకంగా కుక్క పీసీఆర్ గదిలోకి వెళ్లి న్యూస్ చదువుతున్న యాంకర్ దృష్టిని మరల్చింది. ఈ సంఘటన రష్యాలోని ఓ న్యూస్ ఛానల్ లో చోటు చేసుకుంది. అయినా తన పనిని ఆపకుండా వార్తలు చదివింది. ఆమె ముఖంలో కొంత భయం, కొంత వణుకు కనిపించాయి. ఇంతలో ఆ కుక్క టేబుల్ మీదకు ఎక్కి పేపర్లను తన నోటితో తీసేందుకు యత్నించింది. ఈ దృశ్యం అంతా లైవ్లో కొన్ని సెకన్ల పాటు ప్రసారం అయింది. అనంతరం ఆ కుక్కను గోముగా పట్టుకొని ఆ న్యూస్ రీడర్ నవ్వేసింది. ఈ వీడియోను సదరు న్యూస్ ఛానల్ యూట్యూబ్లో పోస్టు చేయగా దీనిని లక్షలాది మంది వీక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more