Two tribal girls gang raped in Agency, hunt on for 8 గిరిజన బాలికలపై పోలీసుల పేరుతో గ్యాంగ్ రేప్

Village elders try to hush up gang rape of two tribal girls

Andhra Pradesh, Visakhapatnam, tribal girls gang rape, Andhra tribal girls gang rape, Visakhapatnam, Minors gang rape, dalit minor girls, Chintapalli, anil pulipati, rape, gang rape, crime

An incident of gangrape of two tribal girls in the Visakhapatnam in AP came to light when the accused tried to hush up the crime by paying compensation to the victims citing tribal customs.

గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్ ను కప్పిపుచ్చే ప్రయత్నం..

Posted: 05/23/2017 04:49 PM IST
Village elders try to hush up gang rape of two tribal girls

విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు అదివాసి గిరిజన బాలికైపై జరిగిన దారుణం అలస్యంగా వెలుగుచూసిన నేపథ్యంలో ఈ ఘటనలో మరో ట్విస్టు కూడా అలస్యంగానే వెలుగులోకి వచ్చింది. పోలీసు పేరుతో ఇద్దరు మైనర్ బాలికలపై ఎనమిది మంది యువకులు అత్యాచారాలకు తెగబడిన వెంటనే రంగంలోకి దిగిన పలువురు ప్రముఖులు.. స్తానిక గ్రామాల పెద్దలు ఆదివాసీ గిరిజన బాలికలకు డబ్బును పరిహారంగా చెల్లించి వారిని విషయాన్ని బయటకు చెప్పకుండా చేసేందుకు ప్రయత్నాలను చేశారు. ఆదివారం ఈ దారుణ ఘటన వెలుగుచూసినా.. సోమవారం వరకు బాలికలతో పాటు వారి తల్లిదండ్రులతో పరిహారం విషయమై చర్చించారని సమాచారం. బాధిత బాలికలు పరిహారాన్ని వ్యతిరేకింది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లాలోని తాజంగి గ్రామపంచాయితీలో జరుగుతున్న పోతురాజబాబు జాతరకు వెళ్లిన లంబసింగికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వారి బందువులతో హాజరయ్యారు. ఆ రోజున రాత్రి ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దయ్యాయి. వర్షం పడటంతో బాలికలు, వారి బంధువులతో కలసి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వెళ్లారు. వారు అలా వెళ్లడాన్ని గమనించిన కొందరు యువకులు వారిని అనుసరించారు.

తాము పోలీసులమంటూ చెప్పి ముందుగా బాలికల బంధువులైన ఆదివాసీ యువకులపై దురుసుగా ప్రవర్తించి వారి సెల్ ఫోన్ లను లాక్కున్నారు. వారు ప్రతిఘటించే సరికి పోలీసులపైనే తిరగబడతారా అంటూ దాడి చేశారు. అలా తమను కోడుతూ బయటకు తీసుకెళ్లి నిర్భంధించారని బాధిత యువకులు చెప్పారు. కాగా అదే సమయంలో మరికొందరు దుండగులు బాలికలపై అత్యాచారం జరిపినట్టు వారు పేర్కొన్నారు. అత్యాచార యత్నానికి పాల్పడుతున్న సమయంలో తిరస్కరించడంతో తమపైనా దాడికి పాల్పడి గాయపరచినట్టు బాధిత బాలికలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తమ పరువు పోతుందని చెప్పి విషయాన్ని గోప్యంగా ఉంచాలని బాధితులను నిందితులు, వారి తరపున రంగంలోకి దిగిన ప్రముఖులు ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే పరిహారం తమకు వద్దని తమపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడాలని బాలికలు స్వయంగా పోలిస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయడంతో మైనార్టీ తీరని బాధిత యువతులను నిర్భంధించి పోలీసుల పేరు చెప్పి వారిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నిందితులపై ఐపీసీ 114, 323, 341, 354, 376(డి) సామూహిక అత్యాచారం, 383, 419, 506, ఐపీసీ5జి ఆర్‌డ్లూ్య6ఆఫ్‌ పోక్సో యాక్టు (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ 2011తోపాటు ఎస్టీ, ఎస్సీ అత్యాచార నిరోధకచట్టం 2015 ప్రకారం బలమైన కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ అనీల్ పులిపాటి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Visakhapatnam  Minors gang rape  dalit minor girls  Chintapalli  anil pulipati  Andhra Pradesh  crime  

Other Articles