kaiyam srihari faints due to illness సొమ్మసిల్లి పడిపోయిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం..

Deputy cm kadiyam faints on stage at warangal

kadiyam srihari faints, dy cm faints in warangal, kadiyam srihari faints on stage, kadiyam faints on telangana formation day, deputy cm, kadiyam srihari, telangana formation day, warangal, Telangana

Deputy chief minister kadiyam sri hari faints due to sunstorke on stage while addressing at warangal in telangana formation day anniversary celebrations

ITEMVIDEOS: సొమ్మసిల్లి పడిపోయిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం..

Posted: 06/02/2017 10:53 AM IST
Deputy cm kadiyam faints on stage at warangal

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కప్పుకూలి పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా వరంగల్‌ నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం తెలంగాణ ప్రభతు్వం ప్రవేశపెట్టిన ప్రగతి నివేదిక చదువుతుండగా వడదెబ్బకు గురైన ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు.

దీంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. ఆయన భద్రతా సబ్బంది వెంటనే స్పందించారు. ఆయనను అక్కడే కింద పడుకోబెట్టి.. గాలి విసిరారు. కొంత మేర కొలుకున్న ఆయను తక్షణం వాహనంలోకి ఎక్కించారు. అక్కడే వున్న జిల్లా వైద్యాధికారులు కూడా వచ్చి ఆయన అరోగ్య పరిస్థితిని పరిశీలించారు. కాగా నిమిషాల వ్యవధిలోనే కడియం కుదుట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కోలుకున్న వెంటనే వెనక్కు తగ్గని కడియం.. మళ్లి వేదికపైకి వచ్చి.. కాసేపు ప్రసంగించారు.

ఇదిలావుంటే అయన సొమ్మసిల్లి పడిపోగానే ప్రాధమిక చికిత్స అందించేందుకు వైద్యులు సిద్దమయ్యారు. తక్షణం ఆయనను ఆసుపత్రిలో చేరాల్సిందిగా వేడుకున్నారు. అయినా తనకేం కాలేదని, కేవలం కొంత మైకం కమ్మి పడిపోయానని చెప్పిన కడియం తిరిగి సభావేదికకు చేరుకుని ప్రగతి నివేదికను పూర్తిగా చదివేశారు. అ తరువాత కూడా వైద్యాధికారులు అయనను ఇప్పటికైనా అసుపత్రికి రావాల్సిందిగా కొరాగా, ఆయన వినిపించుకోలేదు. కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ తాను ఇక్కడే ఉంటానని అధికారులకు స్పష్టం చేశారు. చాలా సేపటివరకు కడియం కారులోనే కూర్చుని వేడుకలను వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deputy cm  kadiyam srihari  telangana formation day  warangal  Telangana  

Other Articles