ప్రేమ పుట్టడానికి సమయం వుండదు.. ఎవరన్ని చూసి హృదయం స్పందించి ప్రేమ మొగ్గలేస్తుందో కూడా తెలియదు.. అలా తెలిస్తే వారిని చూడకుండా దూరంగానే వుంటాం ఇలాంటి సినిమా డైలాగులు విన్నప్పుడు యవ్వనంలో వున్న వారు ఈలలు వేసి చప్పట్లు కొట్టేస్తారు. కానీ అదే నిజజీవితంలోకి వస్తే మాత్రం కథ మరోలా వుంటుంది. కానీ తమిళనాడులోని వెల్లూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా తన్న కు కాబోయే భార్యను ప్రేమించి తనదానిని చేసుకునేందుకు చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. చివరికి విషయం తెలిసి.. ఔరా.. ఇదెక్కడి విచిత్రం అని ముక్కున వేలేసుకున్నారు బంధుజనం.
పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టేశాడు. దీంతో విస్మాయానికి గురైన బంధువులు, మిత్రులు ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపు మరది వరుసైన యువకుడు వదిన వరుసైన వధువు మెడలో తాళి కట్టేశారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన వధువు తల్లిదండ్రులు వరుడు తమ్ముడిని చితకబాదారు. ఆ తరువాత అరా తీయగా వరుడి తమ్ముడు. వధువు ఇద్దరు ప్రేమించుకున్నారని తెలిసింది. తన అన్నతో పెళ్లి చూపులకు వెళ్లిన తమ్ముడు వధువును చూసిచూడగానే ప్రేమలో పడ్డాడు. అక్కడ వధువుది కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. ఇక కాదనలేక వారిద్దరికీ పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఇలవంపట్టి వెన్‌కల్ ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పురోహితులు మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెబుతుండగా వినోద్ పీటలపై ఉన్న అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీంతో తమ్ముడి చేతిలో పరాభవానికి గురైన వరుడు రాజేష్ ఆవేదనకు లోనై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more