Petrol and diesel prices to change everyday ఈ నెల 16నే ముహూర్తం.. ఇక రోజువారీ లెక్క..

Petrol and diesel prices to change everyday from june 16

petrol, diesel, retail fuel, petrol and diesel prices, petrol pump, IOC, BPCL, HPCL

From June 16, petrol and diesel prices will change every day across the country, in sync with international rates, much like it happens in most advanced markets.

ఈ నెల 16నే ముహూర్తం.. ఇక రోజువారీ లెక్క..

Posted: 06/08/2017 08:52 PM IST
Petrol and diesel prices to change everyday from june 16

ఈ నెల 16నే ముహూర్తం.. ఇక రోజువారీ లెక్క.. శీర్షిక చూసి అలోచనలో పడ్డారా..? ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మాకు పెట్రోల్, డీజిల్ ధరలతో సంబంధం లేదని చెప్పేందుకు కేంద్రం చేతులెత్తేసే విధానంలో భాగంగా.. అంతర్జాతీయంగా అడ్వాస్ గా వున్న మార్కెట్లలో మాదిరిగా మన దేశంలో కూడా రోజువారీగా లెక్క మారనుంది. అంతర్జాతీయ మార్కటల్లో వున్న ధరల ప్రకారం మన దేశంలో కూడా ఇక ఇంధన ధరలు మారనున్నాయి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలాంటి ధరతో పెట్రోల్ డీజిల్ ను విక్రయిస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నమాట.

ఇంధన ధరలను రోజువారీగా నిర్ణయించాలని ప్రభుత్వ నిర్వహణలోని ఇంధన సంస్థలు నిర్ణయించాయి. ఇది తమ లాభనష్టాలపై ప్రభావం చూపుతుందని.. నిల్వల నిర్వహణ కష్టమవుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు ప్రతి 15 రోజులకోసారి ఇంధన ధరలను సవరిస్తున్నాయి. జూన్‌ 16 నుంచి రోజువారీగా ఇంధన ధరలను సమీక్షిస్తామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఇప్పటికే మే 1వ తేదీ నుంచి పుదుచ్చేరి, ఛండీగఢ్‌, జెంషెడ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, విశాఖపట్నం నగరాల్లో రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల బాటలోనే ఎస్సార్‌ ఆయిల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి. ఈ నిర్ణయంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే ఇంధన నిల్వలను ఏ ధర వద్ద విక్రయించాలనే దానిపై తీవ్ర గందరగోళం ఉంది. దీనికి తోడు ఇప్పటికీ దేశంలోని చాలా పెట్రోల్‌ బంకుల్లో ఆటోమేటిక్‌ వ్యవస్థలు లేవు. ఫలితంగా తమ లాభాలపై ప్రభావం పడుతుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  retail fuel  petrol and diesel prices  petrol pump  IOC  BPCL  HPCL  

Other Articles