Hyderabad IT corridor Terror Threat Intelligence Agencies warned

Terror threat to hyderabad again

Hyderabad, Terror Attack, Hyderabad Terror Attack Warn, Hyderabad Alert, Hyderabad IT corridor, Hyderabad Inorbit Mall, Inorbit Mall Terror Attack, Inorbit Mall Warn, Cyberabad Rachakonda Police Terror Attack, Telangana Police IB Warn, Kupwara Encounter, Made in Pak Weapons

Intelligence Bureau Warn Telangana Police Terror Threat in IT corridor. Telangana police said on Thursday that some terror outfits had targeted the mall. Following the alert, the Cyberabad police reviewed the security systems at Inorbit Mall and other public and private places where big congregations of people are witnessed frequently. Made in akistan Weapons found in Kupwara Encounter.

భాగ్యనగరం.. ఉగ్ర కలకలం

Posted: 06/09/2017 09:01 AM IST
Terror threat to hyderabad again

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మొత్తం చూపు మన హైదరాబాద్ వైపే ఉండటం తెలిసిందే. కారణాలు సరిగ్గా చెప్పలేకపోయినప్పటికీ లింకులన్నీ దాదాపు ఇక్కడి నుంచే ముడి పడి ఉంటాయి. అదే సమయంలో దాడులకు బాధిత ప్రాంతంగా కూడా భాగ్యనగరం అనేకసార్లు వేదికగా మారింది కూడా. ఆ మధ్య ఏకంగా ఐసిస్ లాంటి కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇక్కడ దాడులకు భారీ కుట్ర చేసినప్పటికీ, ఎన్ఐఏ అప్రమత్తతో ఘోర కలి నుంచి బయటపడగలిగాం. ఇక ఇప్పుడు మరోసారి ఆ హెచ్చరికలు జారీ అయ్యాయి.


హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. హైటెక్ సిటీ, మాదాపూర్, నగరంలో పలు షాపింగ్ మాల్స్ నూ ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు ఐబీ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కారిడార్ లో, మాల్స్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇన్ ఆర్బిట్ మాల్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించటం విశేషం.

కాగా, రంజాన్ మాసం దగ్గర పడుతుండటం, ఆ వెంటనే బోనాలు, వినాయక చవితి, పంద్రాగష్టు తదితరాల నేపథ్యంలో ఐబీ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.

భారీ కుట్ర.. మేడిన్ పాక్...

నౌగమ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందిన విషయం తెలిసందే. అయితే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు, ఆహారం, మందులపై ‘మేడిన్ పాకిస్థాన్’ గుర్తులు ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. గురువారం ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత ఆర్మీ వారి ఆటలు కట్టించింది. కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మందులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అవన్నీ పాకిస్థాన్‌లోనే తయారైనట్టు వాటిపై ముద్రించి ఉండడం పాక్ ఉగ్రదాహాన్ని మరోమారు బహిర్గతం చేసింది. కాగా, ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను అమరుడు కాగా మరో ఇద్దరు గాయపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Terror Attack  IB Warn  

Other Articles