మద్యం సేవిస్తే గమ్మత్తులో పడి చిత్తవుతారని పోలీసులు, పాలకులు, స్వచ్ఛంధ సంస్థలు ఇలా ఎందరు చెప్పినా.. మద్యం మత్తుకు బాసినైనవారు కనీసం చెవికెక్కించుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదని రోడ్డు ప్రమాద గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మద్యం మత్తులో జోగుతూ.. రోడ్డుపైకి రయ్య్ మంటూ వచ్చిన ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. రాజస్థాన్ లో అతివేగంగా, తన కారును నడుపుతూ.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి.. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. రాజస్థాన్ లోని మౌంట్ అబులో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాధ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి.. అతడికి ముందుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళలిద్దరూ కిందపడి కారుకు స్కూటీకి మధ్య చిక్కకుపోయారు. మత్తులో వున్న డ్రైవర్ వారికేమైనా అయ్యిందా..? అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఏకంగా తన కారును అలాగే పోనిచ్చాడు. కొన్ని మీటర్ల దూరం వారిని ఈడ్చుకెళ్లాడు. దీంతో మహిళలు అరుపులు, పెడబొబ్బులు పెట్టడంతో గమనించిన స్థానికులు కారును అడ్డుకున్నారు.
కారు డ్రైవర్ కారులోంచి దిగడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో కారు డోర్ ను బలవంతంగా లాగిన స్థానికులు మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ ను కిందకు దించి దేహశుద్ది చేశారు. ఘటనలో గాయపడిన మహిళలను అసుపత్రిలో చేర్పించారు. అయితే ఇందకు సంబంధించిన స్థానికంగా వున్న ఓ దుకాణంలోని సిసిటీవీ కెమెరా ఆ దృశ్యాలను చిత్రీకరించింది. దీంతో మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దన్న పోలీసులు సూచనలు పెడచెవిన పెడితే ఇలాంటి పరిణమాలే జరుగుతాయన్న విషయం తేటతెల్లమయ్యింది.
#WATCH Mt Abu(Rajasthan):Drunk driver hits woman on scooty,drags both several meters before being stopped by ppl.Woman admitted to hospital pic.twitter.com/ADczX9yaXZ
— ANI (@ANI_news) June 28, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more