దేశ అత్యున్నత అధ్యక్ష పదవికి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సహా 17 విపక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీరాకుమార్ ఇశాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు భవన్ లో అమె కాంగ్రెస్ అగ్రనేతలు, విపక్షాల అగ్రనేతలు, కాంగ్రెస్, వామపక్ష పాలిత ముఖ్యమంత్రులు, మాజీ కేంద్రమంత్రుల తదితర ప్రముఖుల సమక్షంలో అమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మల్లిఖార్జున్ ఖార్గే, గులాం నబీఆజాద్, సీతారాం ఏచూరి, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.
మీరాకుమార్ నామినేషన్ లో భాగంగా మూడు సెట్లను సమర్పించారు. మీరా కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి అమె నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కాగా అంతకుముందు ఆమె రాజ్‌ఘాట్ వద్ద పూజ్య బాపూజీకి నివాళులర్పించి పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. అయితే క్రితం రోజు అమె మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు దళిత వ్యక్తుల మధ్య పోటీ అని మీడియా పేర్కోనడంపై విచారం వ్యక్తం చేశారు.
మీరాకుమార్ తన ప్రచారాన్ని గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభించనున్నారు. ప్రచారంలో భాగంగా అమె జులై 3న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల పోరు నిజంతో జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఈ పోరులో తాము పోరాడుతామని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వెన్నుపోట్ల ఐడియాలజీల నేపథ్యంలో వస్తున్న అధికార అభ్యర్థికి.. జాతీయ వాదంతో జాతిని, దేశ ప్రజలను ఐక్యంగా కలుపుకుపోయే అభ్యర్థులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. మీరాకుమార్ లాంటి గొప్ప నేత రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తుండటం మనం గర్వంగా భావించాల్సిన అవసరముందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more