CM KCR Happy with GST Implementation

Kcr review meet with officials on gst implementation

Telangana, Telangana CM, KCR, KCR GST, Telangana GST, KCR GST Review Meeting, GST Profitable Telangana, KCR Happy GST, GST Slabs in Telangana, Telangana GST Slabs, GST Implementation

Telangana Chief Minister KCR Happy over GST implementation. in Review meeting with officials says GST Profitable to Telangana. No Tax on 20 Lakhs Turnover Companies he added.

జీఎస్టీతో కేసీఆర్ లో ఫుల్ జోష్

Posted: 07/03/2017 06:26 PM IST
Kcr review meet with officials on gst implementation

ఓవైపు వస్తుసేవల పన్నుతో తమ ఆదాయానికి గండిపడుతుందని రాష్ట్రాల్లో కంగారు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జీఎస్టీ తో రాష్ట్రానికి లాభమే కానీ, నష్టమేమీ ఉండదని అభిప్రాయపడ్డాడు. ఒకే దేశం.. ఒకే పన్ను నినాదంతో జూలై 1 నుంచి కేంద్రం జీఎస్టీ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని అమలు వల్ల కలిగే ప్రభావాలపై ఆయా శాఖ ఉన్నతాధికారులతో సోమవారం క్యాంప్ ఆఫీస్ లోని ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏడాదికి రెండు మూడు వేల కోట్ల అదనపు ఆదాయం, రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ గల వ్యాపారులకు పన్ను ఉండదని, రూ.75 లక్షల వరకు టర్నోవర్ ఉన్న వారికి ఒక్క శాతం పన్ను జీఎస్టీ అమలు చేయాలన్నది కేంద్రం నిర్ణయమని పేర్కొన్నాడు. జీఎస్టీలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని, జీఎస్టీపై ప్రజల్లో భయాలను తొలగించాలని, జీఎస్టీపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని, అవగాహనా సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించాడు.


 

వచ్చే నెల 5,6,7 తేదీల్లో 91 వాణిజ్యపన్నుల సర్కిళ్లలో సదస్పులు నిర్వహించాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు కూడా స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీపై వారికి ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని ఆయన ఆదేశించాడు. మొదటి నుంచి కేంద్రం నిర్ణయానికి మద్ధతు తెలుపుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి దానిని సమర్థవంతంగా అమలు చేసేందుకు బాగానే యత్నిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  GST Implementation  CM KCR  

Other Articles